మీరట్ : ‘కరోనా పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అని భయపడక్కర్లేదు.. కరోనా ఉన్నప్పటికీ దాన్ని లేకుండా చేయగలం.. మీకు ఎలాంటి చింత అవసరం లేకుండా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ఇస్తాం’ అంటూ బంపర్ ఆఫర్ ఇస్తోంది ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ ఆస్పత్రి. ఇందుకోసం కేవలం 2,500 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించింది. మనుషుల ప్రాణాలతోనే వ్యాపారమా.. అని ఈ విషయం తెలిసిన వారు నోరెళ్లబెడుతున్నారు. యథేచ్ఛగా నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న న్యూ మీరట్ ఆస్పత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు దాన్ని మూసివేయడంతోపాటు ఆస్పత్రి నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలియజేశారు. (వైరల్ : ఫైన్ వేశారని నానా రభస చేశాడు)
ఆస్పత్రి లైసెన్స్‌ను రద్దు చేశారు. కాగా 2,500 రూపాయలకే కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్లు మీ చేతికి ముట్టజెప్తామంటూ ఆస్పత్రి సిబ్బంది మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇక ఈ ఆరోపణలను సదరు ఆస్పత్రి యజమాని షా అలామ్ తోసిపుచ్చారు. తనకే పాపం తెలియదని, తన పరువుకు భంగం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ వీడియోను వదిలారని వాపోయాడు. పోలీసుల విచారణలో తాను నిర్దోషిని అని రుజువు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. (మత వివక్ష; ఆసుపత్రి యాజమాన్యం క్షమాపణ)
Comments
Please login to add a commentAdd a comment