భవనం కూలి ఐదుగురు మృతి | Building collapse in Uttar Pradesh's Meerut | Sakshi
Sakshi News home page

భవనం కూలి ఐదుగురు మృతి

Published Sun, Mar 13 2016 8:58 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

Building collapse in Uttar Pradesh's Meerut

మీరట్: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఆదివారం విషాద ఘటన జరిగింది. స్థానికంగా కురిసిన భారీ వర్షాలకు ఖార్కుండ ప్రాంతంలో ఓ రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను  సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మీరట్ ప్రాంతంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భవనం పునాదుల్లోకి నీరు చేరడం వలన ఒక్కసారిగా కుప్పకూలినట్లు భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement