ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువతి(18)పై లైంగికదాడికి పాల్పడి అనంతరం గొంతునులిమి చంపేశారు.
మీరట్: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువతి(18)పై లైంగికదాడికి పాల్పడి అనంతరం గొంతునులిమి చంపేశారు. ఈ విషయం ఇంకా నిర్థారణ కానప్పటికీ ఘటన ఆధారంగా పోలీసులు ఈ విషయాన్ని రూడీ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సమీపాన గల కలిద్‌పూర్ గ్రామానికి చెందిన యువతి మంగళవారం సాయంత్రం ఆరుబయటకు వెళ్లింది.
అలా వెళ్లిన యువతి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం గాలించగా గ్రామ శివారులోని అడవిలో శవమై కనిపించింది. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పగా వచ్చి వెంటనే ఆధారాలు సేకరించారు. అనంతరం వాటి వివరాలు మీడియాకు తెలిపారు. 'యువతి వేసుకున్న దుస్తులు చిందరవందరగా చిరిగిపోయి ఉన్నాయి. గొంతు నులిమినట్లు మెడ దగ్గర గాట్లు కనిపించాయి. ఇవన్ని చూస్తుంటే గుర్తు తెలియని వ్యక్తులెవరో ఆమెపై లైంగికదాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది' అని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఘటనా స్థలంలో మృతురాలి ఫోను, ఆమె సోదరి ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.