మీరట్: దేశంలో మహిళలపై, టీనేజ్ బాలికలపై మృగాళ్ల ఆగడాలు శృతిమించుతూనే ఉన్నాయి. తాజాగా ఓ 21 ఏళ్ల మహిళపై స్థానిక కాంగ్రెస్ నేత కుమారుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన మీరట్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లాలో ఉంటున్న ఆ మహిళను జూలై 29 వ తేదీన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత కుమారుడు నోయిడా 29 సెక్టార్ నుంచి బలవంతంగా హోటల్ కు తీసుకువెళ్లి అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు.
దీంతో ఆమె ఫిర్యాదు ఇవ్వడానికి స్థానికి పోలీస్ స్టేషన్ కు వెళితే అక్కడి పోలీసులు దర్యాప్తుకు విముఖత చూపారని డీఐజీ కే.సత్యనారాయణ తెలిపారు. దాంతో ఆ మహిళ తనను ఆశ్రయించడంతో దర్యాప్తుకు ఆదేశించానని ఆయన పేర్కొన్నారు.