ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో సోమవారం వేకువజామున 6 గంటల 28 నిమిషాలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం.. యూపీలోని మీరట్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో గల ఖర్కౌదాలో భూకంప కేంద్రాన్ని కనుగొన్నారు.
కాగా యూపీలోని భూకంప ప్రభావం వల్ల దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. గడిచిన 24 గంటల్లో ఇలా జరగడం రెండోసారి. ఆదివారం మధ్యాహ్నం హర్యానాలోని జజ్జర్ జిల్లాలో సంభవించిన భూకంపం వల్ల ఢిల్లీలో కూడా భూమి స్వల్పంగా కంపించింది.
#FLASH Tremors felt in Delhi after earthquake occurred 6 km from Meerut's Kharkhauda in Uttar Pradesh, at 6.28 am
— ANI (@ANI) September 10, 2018
Comments
Please login to add a commentAdd a comment