అతనికి 747 సంవత్సరాలు! | At 747 years, Hari Singh is Meerut’s oldest voter | Sakshi
Sakshi News home page

అతనికి 747 సంవత్సరాలు!

Published Mon, Apr 20 2015 8:27 AM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM

అతనికి 747 సంవత్సరాలు!

అతనికి 747 సంవత్సరాలు!

మీరట్: హరి సింగ్.. మీరట్ లోని సుభాష్ నగర్ కు చెందిన వ్యక్తి. అయితే అతనికి ఏడు శతాబ్దాలకు పైగానే వయసట. అతని వయసు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగమానదు. మనిషి జీవన ప్రమాణం అంతకాలం ఉంటుందా?అనే అనుమానం కూడా రాకమానదు. ఓటర్ జాబితాలో చోటు చేసుకున్న తప్పిదాల కారణంగానే హరి సింగ్ వయసు అమాంతం వందల ఏళ్లకు పైగా దాటి పెరిగిపోయింది. తాజాగా మీరట్ కంటోన్మెంట్ బోర్డు ఓటరు వెరిఫికేషన్ చేపట్టగా ఈ విషయం బయటపడింది. ఇలా అతనే కాదండోయ్. చాలా మంది 200 వందల సంవత్సరాల నుంచి 600 సంవత్సరాల వయసు కల్గినవారు ఉన్నారు.

 

కేవలం ఒక్క వార్డులోనే  అనేక మంది వందల ఏళ్ల వయసు ఉన్నట్లు కంటోన్మెంట్ బోర్డు సర్వేలో వెలుగుచూసింది. ఇది అలా ఉంచితే కొన్ని చోట్ల తండ్రి వయసు కంటే కుమారుడు వయసే ఎక్కువగా ఉంది. ఉదాహరణకు కొడుకు వయసు 112 సంవత్సరాలు అయితే.. తండ్రి వయసు 72 సంవత్సరాలుగా ఓటర్ జాబితాలో దర్శనమిచ్చింది.  ప్రస్తుతం ఓటరు జాబితాలో చోటు చేసుకున్న తప్పిదాల సవరణకు నడుంబిగించినట్లు కంటోన్మెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డీఎన్ యాదవ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement