Hari Singh
-
సూర్యాపేటలో ఘోరం: ఆడపిల్ల అని తెలిసి అబార్షన్, వైద్యం వికటించి..
సూర్యాపేటటౌన్: పుట్టేది ఆడపిల్ల అని తెలిసి భార్యకు ఆర్ఎంపీతో భర్త అబార్షన్ చేయించగా, వైద్యం వికటించి ఆమె మృతిచెందింది. మృతురాలి కుటుంబసభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం ఎంజీనగర్‌తండాకు చెందిన రత్నావత్ హరిసింగ్‌కు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని రాముతండాకు చెందిన సుహాసిని(26)కి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు. సుహాసిని మూడోసారి గర్భవతి కాగా, స్కానింగ్‌లో ఆడపిల్ల అని తెలియడంతో హరిసింగ్ సుహాసినికి అబార్షన్ చేయించాలనుకున్నాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ సలహా తీసుకోగా.. ఏడో నెలలో అబార్షన్ చేయిస్తే తల్లీబిడ్డకు ప్రమాదం ఉంటుందని ఆమె చెప్పింది. అయినా, సుహాసినిని రెండురోజుల క్రితం బలవంతంగా హరిసింగ్ హుజూర్నగర్ ప్రాంతంలో ఓ ఆర్ఎంపీతో అబార్షన్ చేయించాడు. అయితే వైద్యం వికటించి సుహాసిని పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన వైద్యం కోసం కోదాడకు, ఆపై ఖమ్మంకు అక్కడ నుంచి సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకురాగా ఆమె మృతి చెందింది. అయితే సుహాసిని మృతిచెందిన విషయాన్ని హరిసింగ్ కుటుంబసభ్యులకు చెప్పకుండా ఎంజీనగర్ తండాకు తీసుకొచ్చాడని, గ్రామస్తులు గమనించి విషయం తమకు తెలిపారని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై చివ్వెంల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. సూర్యాపేటటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పంపించారు. అయితే పోలీసులు ఫిర్యాదు తీసుకోవట్లేదని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. పీహెచ్డీ చేసిన హరిసింగ్.. హరిసింగ్ నెలరోజుల క్రితమే ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నాడని, ఉన్నత చదువులు చదివిన వ్యక్తే బలవంతంగా అబార్షన్ చేయించి సుహాసిని మృతికి కారణమయ్యాడని మృతురాలి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మళ్లీ బరితెగించిన పాక్..
సాక్షి, శ్రీనగర్: నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపి భారత ఆర్మీ లెఫ్టినెంట్ అధికారి, ముగ్గురు జవాన్లను పొట్టన పెట్టుకున్న ఘటన మరువక ముందే జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని మహారాజా హరిసింగ్ హాస్పిటల్లోకి ప్రవేశించిన కొందరు ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పులకు భయపడి రోగులు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేయడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కాల్పులు ఎదురుకాల్పులు జరిపారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఉగ్రవాదుల ఆకస్మిక కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. వారికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. -
అతనికి 747 సంవత్సరాలు!
మీరట్: హరి సింగ్.. మీరట్ లోని సుభాష్ నగర్ కు చెందిన వ్యక్తి. అయితే అతనికి ఏడు శతాబ్దాలకు పైగానే వయసట. అతని వయసు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగమానదు. మనిషి జీవన ప్రమాణం అంతకాలం ఉంటుందా?అనే అనుమానం కూడా రాకమానదు. ఓటర్ జాబితాలో చోటు చేసుకున్న తప్పిదాల కారణంగానే హరి సింగ్ వయసు అమాంతం వందల ఏళ్లకు పైగా దాటి పెరిగిపోయింది. తాజాగా మీరట్ కంటోన్మెంట్ బోర్డు ఓటరు వెరిఫికేషన్ చేపట్టగా ఈ విషయం బయటపడింది. ఇలా అతనే కాదండోయ్. చాలా మంది 200 వందల సంవత్సరాల నుంచి 600 సంవత్సరాల వయసు కల్గినవారు ఉన్నారు. కేవలం ఒక్క వార్డులోనే అనేక మంది వందల ఏళ్ల వయసు ఉన్నట్లు కంటోన్మెంట్ బోర్డు సర్వేలో వెలుగుచూసింది. ఇది అలా ఉంచితే కొన్ని చోట్ల తండ్రి వయసు కంటే కుమారుడు వయసే ఎక్కువగా ఉంది. ఉదాహరణకు కొడుకు వయసు 112 సంవత్సరాలు అయితే.. తండ్రి వయసు 72 సంవత్సరాలుగా ఓటర్ జాబితాలో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఓటరు జాబితాలో చోటు చేసుకున్న తప్పిదాల సవరణకు నడుంబిగించినట్లు కంటోన్మెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డీఎన్ యాదవ్ తెలిపారు. -
కేరళ ఎక్స్‌ప్రెస్‌లో రగడ
చిత్తూరు(అర్బన్), న్యూస్‌లైన్: త్రివేండ్రం నుంచి న్యూ ఢిల్లీకి వెళ్లే కేరళ ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకున్న రగడ ఒకరి ప్రాణంపైకి రాగా, ముగ్గురు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు రైల్వే టీటీలకు చుట్టుకుంది. చిత్తూరు రైల్వే స్టేషన్లో ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. గవర్నమెంట్ రైల్వే పోలీసుల కథనం మేరకు.. కేరళ ఎక్స్‌ప్రెస్ గత నెల 31వ తేదీ అర్ధరాత్రి 2.50 గంటలకు చిత్తూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఎస్-9 కోచ్ నుంచి సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ హరిసింగ్ (54)ను రైలు నుంచి కొడుతూ కొందరు కిందకు దింపేశారు. తమిళనాడులోని కొయంబత్తూరులో శిక్షణ పూర్తి చేసుకుని హరిసింగ్ స్వస్థలమైన ఆగ్రాకు వెళుతున్నా డు. ఇతను ప్రయాణికులతో అమర్యాద ప్రవర్తించడం తో వాగ్వాదం చోటు చేసుకుంది. డ్యూటీలో ఉన్న ఇ ద్దరు టికెట్ కలెక్టర్లు, ముగ్గురు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు కానిస్టేబుళ్లు, ఒక ప్రయాణికుడు హరిసింగ్‌పై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన హరిసింగ్ ప్రథమ చి కిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నాడు. ఒక రోజు చికిత్స తీసుకుని పరిస్థితి విషమించడంతో సమాచారాన్ని బంధువులకు తెలియచేశాడు. వారు చిత్తూరుకు చేరుకుని, అతన్ని తిరుపతిలోని ప్రైవేటు ఆ స్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారకస్థితిలోకి వె ళ్లడంతో అక్కడి నుంచి చెన్నైలోని మియాట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయస్థితిలో ఉ న్నారు. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అరెస్టు.... ఈఘటనపై బాధితుని ఫిర్యాదు మేరకు చిత్తూరు గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ) ఈ నెల 3న కేసు నమోదు చేశారు. చిత్తూరు ఆర్పీఎఫ్లో పనిచేసే మో హన్‌రెడ్డి, వాసు, కనవ్, టికెట్ కలెక్టర్లు కన్నన్కుట్టి, జ యరాజ్, మరో ప్రయాణికుడిపై కేసు నమోదు చేశా రు. మోహన్‌రెడ్డిని శుక్రవారం అరెస్టు చేసి నెల్లూరు రై ల్వే కోర్టుకు తరలించగా, రిమాండు విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన ఇద్దరు కానిస్టేబుళ్లలో వాసు తిరుపతి రుయా ఆస్పత్రి లో అనారోగ్య కారణంగా చికిత్స పొందుతుండగా, ఇతను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే అరెస్టు చేయనున్నారు. మరో కానిస్టేబుల్ కన్నన్ కోసం గాలిస్తున్నారు. టికెట్ కలెక్టర్లను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందం ఇప్పటికే కేరళలో గాలిస్తోంది. ఈ దాడిని కేంద్ర పోలీసు దళాలు తీవ్రంగా పరిగణించారుు. నిందితులను వదలిపెట్టకూడదని జీఆర్పీ పోలీసులను ఆదేశించాయి. జీఆర్పీ డీ ఎస్పీ పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు సాగుతోంది.