చిత్తూరు(అర్బన్), న్యూస్‌లైన్: త్రివేండ్రం నుంచి న్యూ ఢిల్లీకి వెళ్లే కేరళ ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకున్న రగడ ఒకరి ప్రాణంపైకి రాగా, ముగ్గురు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు రైల్వే టీటీలకు చుట్టుకుంది. చిత్తూరు రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. గవర్నమెంట్ రైల్వే పోలీసుల కథనం మేరకు.. కేరళ ఎక్స్‌ప్రెస్ గత నెల 31వ తేదీ అర్ధరాత్రి 2.50 గంటలకు చిత్తూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఎస్-9 కోచ్ నుంచి సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ హరిసింగ్ (54)ను రైలు నుంచి కొడుతూ కొందరు కిందకు దింపేశారు.
తమిళనాడులోని కొయంబత్తూరులో శిక్షణ పూర్తి చేసుకుని హరిసింగ్ స్వస్థలమైన ఆగ్రాకు వెళుతున్నా డు. ఇతను ప్రయాణికులతో అమర్యాద ప్రవర్తించడం తో వాగ్వాదం చోటు చేసుకుంది. డ్యూటీలో ఉన్న ఇ ద్దరు టికెట్ కలెక్టర్లు, ముగ్గురు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు కానిస్టేబుళ్లు, ఒక ప్రయాణికుడు హరిసింగ్‌పై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన హరిసింగ్ ప్రథమ చి కిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నాడు. ఒక రోజు చికిత్స తీసుకుని పరిస్థితి విషమించడంతో సమాచారాన్ని బంధువులకు తెలియచేశాడు. వారు చిత్తూరుకు చేరుకుని, అతన్ని తిరుపతిలోని ప్రైవేటు ఆ స్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారకస్థితిలోకి వె ళ్లడంతో అక్కడి నుంచి చెన్నైలోని మియాట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయస్థితిలో ఉ న్నారు.
ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అరెస్టు....
ఈఘటనపై బాధితుని ఫిర్యాదు మేరకు చిత్తూరు గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) ఈ నెల 3న కేసు నమోదు చేశారు. చిత్తూరు ఆర్పీఎఫ్‌లో పనిచేసే మో హన్‌రెడ్డి, వాసు, కనవ్, టికెట్ కలెక్టర్లు కన్నన్‌కుట్టి, జ యరాజ్, మరో ప్రయాణికుడిపై కేసు నమోదు చేశా రు. మోహన్‌రెడ్డిని శుక్రవారం అరెస్టు చేసి నెల్లూరు రై ల్వే కోర్టుకు తరలించగా, రిమాండు విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
మిగిలిన ఇద్దరు కానిస్టేబుళ్లలో వాసు తిరుపతి రుయా ఆస్పత్రి లో అనారోగ్య కారణంగా చికిత్స పొందుతుండగా, ఇతను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే అరెస్టు చేయనున్నారు. మరో కానిస్టేబుల్ కన్నన్ కోసం గాలిస్తున్నారు. టికెట్ కలెక్టర్లను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందం ఇప్పటికే కేరళలో గాలిస్తోంది. ఈ దాడిని కేంద్ర పోలీసు దళాలు తీవ్రంగా పరిగణించారుు. నిందితులను వదలిపెట్టకూడదని జీఆర్‌పీ పోలీసులను ఆదేశించాయి. జీఆర్‌పీ డీ ఎస్పీ పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు సాగుతోంది.
కేరళ ఎక్స్‌ప్రెస్‌లో రగడ
Published Sun, Nov 10 2013 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM
Advertisement
Advertisement