Government Railway Police
-
'జీరో' ఎఫ్ ఐ ఆర్ తో రైలు దొంగతనాలకు చెక్!
రైల్లో దొంగతనం జరిగితే ఏ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి? అన్ని రైల్వే స్టేషన్లలో రైల్వే పోలీస్ స్టేషన్లుండవు. అలాంటప్పుడు ఏం చేయాలి? మౌలాలీలో దొంగతనం జరిగితే కాజీపేట దాకా ఆగాల్సిందేనా? అన్నవరంలో సూట్ కేస్ పోతే సామర్లకోట దాకా పోలీసుల కోసం వేచి ఉండాల్సిందేనా? ఇకపై ప్రయాణికులు అలా బాధపడుతూ కూర్చోనక్కర్లేదంటున్నారు రైల్వే పోలీసులు. ఇకపై జీరో ఎఫ్ ఐ ఆర్ అనే కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నారు. ప్రయాణం చేస్తూనే ఏదో ఒక రైల్వే స్టేషన్ లో ఫిర్యాదు దాఖలు చేయొచ్చు. దీన్ని ఆ స్టేషన్ సిబ్బంది సమీప పోలీస్ స్టేషన్ కు ఫ్యాక్స్ చేస్తారు. దాంతో పోలీసులు తక్షణమే రంగ ప్రవేశం చేయడానికి, దొంగల్ని పట్టుకోవడానికి వీలుంటుంది. ఢిల్లీలో శుక్రవారం జరిగిన రైల్వే ఐజీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి దాకా ఏ పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కడి దాకా అన్నది పెద్ద సమస్యగా ఉంది. వేరే చోట దొంగతనం అయితే తమ స్టేషన్ లో కేసు నమోదు చేయమని పోలీసులు వాదిస్తున్నారు. దీని వల్ల పోలీసులు రంగంలోకి దిగడం ఆలస్యమౌతోంది. అంతలో దొంగలు సొమ్ముతో సహా ఉడాయించేస్తున్నారు. ఇదొక్కటే కాదు. గవర్నమెంట్ రైల్వే పోలీసు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు, రాష్ట్రాల పోలీసుల మధ్య కూడా సరిహద్దుల విషయంలో బోల్డన్ని పట్టింపులున్నాయి. ఇవన్నీ కేసులను నీరు కార్చేస్తున్నాయి. కొత్త విధానం అమలైతే ఆ సమస్యలన్నీ పరిష్కారమౌతాయని, వీలైనంత త్వరగా సొమ్ము రికవరీ చేయవచ్చునని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. ప్రయాణికులు కూడా జీరో ఎఫ్ ఐఆర్ 'జీరో' గా మిగలకూడదని, 'హీరో' గా ఎదగాలని కోరుకుంటున్నారు. -
‘అనూహ్య’ దారుణం
సాక్షి, మచిలీపట్నం/విజయవాడ: ముంబయిలో ఉద్యోగం చేస్తూ క్రిస్మస్ వేడుకలకు సొంతూరు బందరు వచ్చిన కూతురుతో ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా గడిపారు.. చర్చిలో జరిగిన వేడుకల్లోను ఆమె ఎంతో చురుగ్గా పాల్గొంది.. తిరిగి ఈ నెల నాలుగున ముంబయి వెళ్లింది. ఆ ఆనందపు క్షణాలు ఇంకా బంధుమిత్రుల కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి.. ఇంతలోనే ఆమె ‘అనూహ్య’గా దారుణ హత్యకు గురైందన్న వార్త కలవరపాటుకు గురిచేసింది.. ముంబయిలో బందరు యువతిపై జరిగిన ఘాతుకం తెలుసుకున్న జిల్లా తల్లడిల్లుతోంది. ముంబయిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మచిలీపట్నానికి చెందిన ఎస్తేర్ అనూహ్య (23) అత్యంత దారుణ స్థితిలో మృతిచెందిన వైనం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. క్రిస్మస్ కోసం వచ్చిన ఆమె తిరిగి ముంబయికి పయనమైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 16న శవమై కనిపించింది. ఆమె మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. తండ్రి రిటైర్మెంట్ రోజునే ఉద్యోగం... తన తండ్రి ఉద్యోగ విరమణ రోజునే అనూహ్య ఉద్యోగం చేపట్టిందని సన్నిహితులు చెబుతున్నారు. మచిలీపట్నం నోబుల్ కాలనీకి చెందిన శింగవరపు జోనతమ్ సురేంద్రప్రసాద్, జ్యోత్స్నలకు ఎస్తేర్ అనూహ్య (23), లావణ్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. స్థానిక నోబుల్ కాలేజీలో పాలిటిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా చేస్తూ ఏడాది క్రితం ఆయన రిటైరయ్యారు. పెద్ద కుమార్తె అనూహ్య ఒకటి నుంచి ఏడు వరకు షారన్ స్కూలులో చదువుకోగా ఎనిమిది నుంచి పదో తరగతి వరకు అమలేశ్వరి విద్యానికేతన్‌లో చదివింది. శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తిచేసింది. అనంతరం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూలో ఇంజినీరింగ్ చేసింది. రెండో కుమార్తె లావణ్య గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది. అనూహ్య జేఎన్టీయూ (కాకినాడ) ఆఖరి ఏడాది చదువు పూర్తవుతున్న తరుణంలోనే క్యాంపస్ సెలక్షన్స్‌లో ముంబయిలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగానికి ఎంపికైంది. ఏడాది క్రితం ప్రసాద్ నోబుల్ కాలేజిలో ఉద్యోగ విరమణ చేసిన రోజునే టీసీఎస్‌కు ఎంపికైన అనూహ్య విధుల్లో చేరినట్టు చెబుతున్నారు. అనంతరం ఆరు నెలల పాటు కేరళలో శిక్షణ పొందగా కంపెనీ ముంబయిలో పోస్టింగ్ ఇచ్చింది. అప్పటి నుంచి అనూహ్య ముంబైలోని వైఎంసీఏ హాస్టల్లో ఉంటూ ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. అనూహ్యంగా దూరమైంది... అయినవారి మధ్య క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఆనందంగా గడిపిన అనూహ్య ఈ నెల నాలుగున ముంబయికి తిరిగి బయల్దేరింది. తండ్రి ప్రసాద్ విజయవాడ రైల్వేస్టేషన్‌కు కారులో తీసుకెళ్లి తగిన జాగ్రత్తలు చెప్పి రెలైక్కించారు. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆమె ఫోన్ చేసి సోలాపూర్ వరకు వెళ్లినట్టు చెప్పింది. తన ఫోన్ చార్జింగ్ అయిపోయిందని తరువాత మాట్లాడతానని తెలిపింది. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి ఫోన్ రాలేదు. మరుసటి రోజు ఉదయం వరకు వేచిచూసిన ప్రసాద్ అనూహ్యకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించారు. స్విచాఫ్ అని సమాధానం రావటంతో అనుమానం వచ్చిన ఆయన హాస్టల్‌కు ఫోన్ చేశారు. ఆమె ఇంకా రాలేదని సమాధానం రావటంతో కంగారుపడి ఆరోజు సాయంత్రం వరకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. సాయంత్రానికి చేరలేదని తెలియటంతో ముంబయిలోని తన బంధువులకు విషయం చెప్పగా వారు అక్కడి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు విజయవాడలో ప్రసాద్ బావమరిది ఫిర్యాదు అందించారు. ఈ నేపథ్యంలో ప్రసాద్ ముంబయికి బయలుదేరి వెళ్లారు. విజయవాడ పోలీసులు ముంబయిలోని రైల్వే పోలీసులకు ఫ్యాక్స్ ద్వారా సమాచారం అందించగా, వారు దర్యాప్తు చేపట్టారు. కుటుంబసభ్యులు కూడా ఆచూకీ కోసం రోజులతరబడి గాలించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో గాలింపు ముమ్మరంగా చేయగా బంధువులకు ముంబయిలోని కుంజూర్‌మార్గ్ అనే ప్రాంతంలోని ఓ చెరువు గట్టు పక్క నుంచి భరించలేని దుర్గంధం వస్తుండటంతో అనుమానం వచ్చిన ప్రసాద్ అక్కడికివెళ్లి చూడగా ఒంటిపై యాసిడ్ పోసిన విధంగా దాదాపు 70 శాతం వరకు కాలిపోయిన గాయాలతో గుర్తుపట్టలేని విధంగా ఓ యువతి మృతదేహం కనిపించింది. చేతికున్న ఉంగరాన్ని చూసి ప్రసాద్ అది అనూహ్య మృతదేహంగా గుర్తించి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ముంబయి పోలీసుల తీరుపై బంధువుల ఆగ్రహం... అనూహ్య మరణవార్త తెలుసుకున్న బంధువులు ముంబయి పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. యువతి అదృశ్యంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా దురుసుగా వ్యవహరించటాన్ని తప్పుపడుతున్నారు. ఈ ఘటనకు ముంబయి పోలీసుల వైఫల్యమే కారణమని, అందుకు వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉందని మండిపడుతున్నారు. అంతుచిక్కని అనుమానాలెన్నో.. టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న అనూహ్య మృతిపై బంధువులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 5న ముంబయి చేరిన అనూహ్య అక్కడి నుంచి ఎక్కడికెళ్లి ఉంటుందనే విషయాన్ని ముంబయి పోలీసులు ఇంతవరకు తేల్చలేకపోయారు. అనూహ్యపై గుర్తుతెలియని దుండగులు లైంగికదాడి చేసి హత్య చేసి ఉంటారా? లేక డబ్బు కోసం ఈ హత్య చేసి ఉంటారా? సహోద్యోగుల నుంచి ఏదైనా ఆపద వచ్చిందా? స్నేహితులెవరైనా ఈ అకృత్యానికి ఒడిగట్టారా? అనే అనుమానాలు బంధువులను దహించివేస్తున్నాయి. పోస్టుమార్టం పూర్తయితే ఏం జరిగిందనేది తెలిసే అవకాశముంది. అంత్యక్రియలకు ఏర్పాట్లు.. అనూహ్య మృతిపై కేసు నమోదు చేసిన ముంబయి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు బంధువులు చెబుతున్నారు. ముంబయి నుంచి శుక్రవారం రాత్రి 8 గంటలకు విమానంలో బయలుదేరి రాత్రి 10 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు బంధువులు తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు మచిలీపట్నంలో అనూహ్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేను దేవుడ్ని నమ్ముకున్నా.. నా బిడ్డ చనిపోదు.. నేను దేవుడ్ని నమ్ముకున్నా.. నా బిడ్డకు ఏం కాదు.. ఆమె చనిపోలేదు.. ఇది గుండె వ్యాధితో బాధపడుతున్న అనూహ్య తల్లి జ్యోత్స్న ఆవేదన. కూతురి ఆచూకీ కోసం గాలిస్తూ ముంబయికి వెళ్లిన తండ్రి ప్రసాద్‌కు అనూహ్య మృతదేహం కన్పించడంతో గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. తన భర్త వెళ్లి కూతురు ఎక్కడ ఉందో తెలుసుకుంటారని ఆశగా ఎదురు చూస్తున్న జ్యోత్స్నకు అసలు సంగతి చెప్పేందుకు మొదట ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. ఆమెకు గుండె వ్యాధి కారణంగా బంధువులు వచ్చిన అనంతరం కాస్త గుండె దిటవు చేసుకుని చెప్పారు. అయినా తన బిడ్డ తిరిగి వస్తుందన్న ఆశతో ఆ తల్లి ఎదురు చూస్తోంది. -
కేరళ ఎక్స్‌ప్రెస్‌లో రగడ
చిత్తూరు(అర్బన్), న్యూస్‌లైన్: త్రివేండ్రం నుంచి న్యూ ఢిల్లీకి వెళ్లే కేరళ ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకున్న రగడ ఒకరి ప్రాణంపైకి రాగా, ముగ్గురు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు రైల్వే టీటీలకు చుట్టుకుంది. చిత్తూరు రైల్వే స్టేషన్లో ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. గవర్నమెంట్ రైల్వే పోలీసుల కథనం మేరకు.. కేరళ ఎక్స్‌ప్రెస్ గత నెల 31వ తేదీ అర్ధరాత్రి 2.50 గంటలకు చిత్తూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఎస్-9 కోచ్ నుంచి సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ హరిసింగ్ (54)ను రైలు నుంచి కొడుతూ కొందరు కిందకు దింపేశారు. తమిళనాడులోని కొయంబత్తూరులో శిక్షణ పూర్తి చేసుకుని హరిసింగ్ స్వస్థలమైన ఆగ్రాకు వెళుతున్నా డు. ఇతను ప్రయాణికులతో అమర్యాద ప్రవర్తించడం తో వాగ్వాదం చోటు చేసుకుంది. డ్యూటీలో ఉన్న ఇ ద్దరు టికెట్ కలెక్టర్లు, ముగ్గురు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు కానిస్టేబుళ్లు, ఒక ప్రయాణికుడు హరిసింగ్‌పై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన హరిసింగ్ ప్రథమ చి కిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నాడు. ఒక రోజు చికిత్స తీసుకుని పరిస్థితి విషమించడంతో సమాచారాన్ని బంధువులకు తెలియచేశాడు. వారు చిత్తూరుకు చేరుకుని, అతన్ని తిరుపతిలోని ప్రైవేటు ఆ స్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారకస్థితిలోకి వె ళ్లడంతో అక్కడి నుంచి చెన్నైలోని మియాట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయస్థితిలో ఉ న్నారు. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అరెస్టు.... ఈఘటనపై బాధితుని ఫిర్యాదు మేరకు చిత్తూరు గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ) ఈ నెల 3న కేసు నమోదు చేశారు. చిత్తూరు ఆర్పీఎఫ్లో పనిచేసే మో హన్‌రెడ్డి, వాసు, కనవ్, టికెట్ కలెక్టర్లు కన్నన్కుట్టి, జ యరాజ్, మరో ప్రయాణికుడిపై కేసు నమోదు చేశా రు. మోహన్‌రెడ్డిని శుక్రవారం అరెస్టు చేసి నెల్లూరు రై ల్వే కోర్టుకు తరలించగా, రిమాండు విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన ఇద్దరు కానిస్టేబుళ్లలో వాసు తిరుపతి రుయా ఆస్పత్రి లో అనారోగ్య కారణంగా చికిత్స పొందుతుండగా, ఇతను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే అరెస్టు చేయనున్నారు. మరో కానిస్టేబుల్ కన్నన్ కోసం గాలిస్తున్నారు. టికెట్ కలెక్టర్లను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందం ఇప్పటికే కేరళలో గాలిస్తోంది. ఈ దాడిని కేంద్ర పోలీసు దళాలు తీవ్రంగా పరిగణించారుు. నిందితులను వదలిపెట్టకూడదని జీఆర్పీ పోలీసులను ఆదేశించాయి. జీఆర్పీ డీ ఎస్పీ పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు సాగుతోంది.