యువతిపై 3 రోజులు సామూహిక అత్యాచారం
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీటర్ నగరం ఇప్పుడు సామూహిక అత్యాచారాలకు నిలయంగా మారిపోయింది. ఈ నగరంలో అపరకీచకులు ఎక్కువైపోయారు. కొద్ది రోజుల క్రితం ఓ యువతిపై కొందరు యువకులు సామూహికంగా అత్యాచారం చేసి, ఇస్లాంమత మార్పిడికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. గత ఆదివారం మరో 15 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇప్పడు అదే మీరట్‌లో 18 ఏళ్ల యువతిపై ఇద్దరు యువకులు మూడు రోజులపాటు సామూహిక అత్యాచారం చేశారు.
పరీక్షిత్‌గఢ్ ప్రాంతంలో సోదరుడితో కలసి అడవిలోకి వెళ్తున్న యువతిని సాజిద్, జుబేర్ అనే నిందితులు కిడ్నాప్ చేశారు. ఆమెను ఓ ఇంట్లో నిర్బంధించి మూడు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఈ దారుణాన్ని కెమెరాలో చిత్రీకరించారు. నిందితుల్లో ఒకరి ఫోన్ నుంచి బాధితురాలు కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సాజిద్‌ను అరెస్టు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.