యువతి కిడ్నాప్, 3 రోజులపాటు గ్యాంగ్‌రేప్ | Kidnapped young woman, a 3-day gang rape | Sakshi
Sakshi News home page

యువతి కిడ్నాప్, 3 రోజులపాటు గ్యాంగ్‌రేప్

Published Sun, Aug 10 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM

యువతి కిడ్నాప్, 3 రోజులపాటు గ్యాంగ్‌రేప్

యువతి కిడ్నాప్, 3 రోజులపాటు గ్యాంగ్‌రేప్

మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ యువతి (18)ని కిడ్నాప్ చేసిన ఇద్దరు కీచకులు ఆమెపై మూడు రోజులపాటు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరీక్షిత్‌గఢ్‌లో సోదరుడితో కలసి అడవిలోకి వెళ్తున్న యువతిని ఎత్తుకెళ్లిన సాజిద్, జుబేర్ అనే నిందితులు ఆమెను ఓ ఇంట్లో నిర్బంధించి మూడు రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డారు.

పైగా ఈ దారుణాన్ని కెమెరాలో చిత్రీకరించారు. నిందితుల్లో ఒకరి ఫోన్ నుంచి బాధితురాలు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు సాజిద్‌ను అరెస్టు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement