
లక్నో : మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాల ప్రారంభానికి ముందు వందేమాతరం పాడబోమని మీరట్ మేయర్ బీఎస్పీకి చెందిన సునీతా వర్మ స్పష్టం చేశారు. భారత జాతీయ గీతం జనగణమన అని ఆ గీతాన్నిమాత్రమే ఆలపిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మీరట్, అలీఘడ్ ప్రాంతాల్లో బీఎస్పీ విజయాన్ని సొంతం చేసుకుంది.
అయితే, ఈ ప్రాంతాల్లో సమావేశాల ప్రారంభ సమయంలో వందేమాతరం ఆలపించాలని గతంలో పనిచేసిన మేయర్లు షరతు పెట్టగా కొత్తగా ఎన్నికైన సునీతా ఆ విధానాన్ని నిరాకరించారు. కేవలం తాము జనగణమన మాత్రమే ఆలపిస్తామని స్పష్టం చేశారు. దీనిపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేసినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు నిరాకరించారు. ముఖ్యంగా బీజేపీ నేతలు సునీతా వర్మ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment