తల్లీ పిల్లల గొంతులు కోసేశారు | Woman, her four children murdered in Meerut | Sakshi
Sakshi News home page

తల్లీ పిల్లల గొంతులు కోసేశారు

Published Tue, Jan 27 2015 11:55 AM | Last Updated on Mon, Jul 30 2018 9:16 PM

తల్లీ పిల్లల గొంతులు కోసేశారు - Sakshi

తల్లీ పిల్లల గొంతులు కోసేశారు

లక్నో: తల్లితోపాటు ఆమె నలుగురి సంతానాన్ని గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ మీరట్ నగరంలో సోమవారం సంచలనం సృష్టించింది. మీరట్ నగరంలోని సుహాల్ గార్డెన్లో ఓ ఇంట్లో రక్తపు మడుగులో ఐదుగురు పడి ఉన్నారని ఆగంతకులు పోలీసులు ఫోన్లో సమాచారం అందించారు. దాంతో పోలీసులు సదరు నివాసానికి చేరుకుని పోలీసులు మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు.

మృతుల్లో తల్లి రుక్సానాతోపాటు ఆమె పిల్లలు రిన్షా (20), జూలీ (8), గూంగీ (6), సుహాల్  (12) గా గుర్తించినట్లు చెప్పారు. అలాగే ఆ ఇంట్లో మరో మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఆ మృతదేహం ఎవరిదో గుర్తించవలసి ఉందని తెలిపారు. మృతుల గొంతుకలను మాత్రం బాగా పదునైన ఆయుధాలతో కొసి వేశారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఓ హత్య కేసులో రుక్సానా భర్త ఇప్పటికే జైలులో ఉన్నారని పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement