మజాక్ నుంచి మత కల్లోలం దాకా....
మజాక్ నుంచి మత కల్లోలం దాకా....
Published Wed, Jul 2 2014 3:29 PM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM
ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సరదాగా మొదలైన వేళాకోళం వికటించి ఏకంగా మత ఉద్రిక్తతకి దారి తీసి, అయిదుగురు గాయపడేదాకా వచ్చింది. ఇదంతా ఇప్పటికే కమ్యూనల్ కుంపటిపై కుతకుతలాడుతున్న మీరట్ నగరంలో జరిగింది. ప్రస్తుతం అక్కడ పోలీసుల బలగాలను మొహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
మీరట్ లోని లాల్ కుర్తీ ప్రాంతంలో పింటూ, అజ్జూ అనే ఇద్దరు దోస్తులు ఒకరినొకరు ఆట పట్టించుకున్నారు. అది నెమ్మదిగా వేడెక్కింది. ఇంతలోపింటూ ఒక అగ్గిపుల్ల వెలిగించి అజ్జూపైకి విసిరాడు. అంతే... అజ్జూ కి తిక్కరేగింది. క్షణాల్లో ఫోన్ చేసి మిత్రులందరినీ పిలుచుకున్నారు. పింటూ తనవారిని లాఠీలతో సహా రమ్మన్నాడు. అంతే నినాదాలు, వివాదాలు, లాఠీలు, ఈటెలు మొదలయ్యాయి.
చివరికి ఒకరు నాటు తుపాకీ తెచ్చి పేల్చాడు. దాంతో జనం శివాలెత్తి పెళ్లి బస్సు సహా కనిపించిన వాహనాలను ధ్వంసం చేశారు. రాళ్లు విసురుకోవడం మొదలైంది. చివరికి పోలీసులను దించి, కర్ ఫ్యూ విధించి, గంటల పాటు శ్రమిస్తే కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇప్పటికీ అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
Advertisement
Advertisement