
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మీరట్ : ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మీరట్‌లోని హోటల్స్ వ్యభిచారానికి హబ్‌లుగా మారాయి. సదర్‌బజార్ పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని పలు హోటల్స్‌పై పోలీసులు దాడులు జరిపి 35 మంది సెక్స్‌వర్కర్లు, విటులను అరెస్ట్ చేశారు. ఆరుకు పైగా హోటల్స్‌పై పోలీసులు దాడులు చేశారు.
పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన జంటలను మహిళా కానిస్టేబుళ్ల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసినవారిని బస్సుల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మీరట్ హోటల్స్‌లో కొన్నేళ్లుగా సెక్స్ రాకెట్ నడుస్తున్నట్టు సమాచారం. పోలీసు అధికారులు ముడుపుల మత్తులో ఈ బాగోతానికి సహకరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment