బాయ్ఫ్రెండ్ కోసం కొట్టుకున్నారు.. | two girls fight over boyfriend on street in meerut | Sakshi
Sakshi News home page

బాయ్ఫ్రెండ్ కోసం కొట్టుకున్నారు..

Jul 25 2015 10:49 AM | Updated on Oct 2 2018 6:46 PM

బాయ్ఫ్రెండ్ కోసం కొట్టుకున్నారు.. - Sakshi

బాయ్ఫ్రెండ్ కోసం కొట్టుకున్నారు..

అచ్చం సినిమాల్లో జరిగినట్లే... బాయ్ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతులు రోడ్డెక్కారు. అంతటితో ఆగకుండా రోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఇద్దరూ తమ చేతులకు పని చెప్పారు.

మీరట్ : అచ్చం సినిమాల్లో జరిగినట్లే...  బాయ్ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతులు రోడ్డెక్కారు.  అంతటితో ఆగకుండా రోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఇద్దరూ తమ చేతులకు పని చెప్పారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ భయంకరంగా కొట్టుకున్నారు.  ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది.  మీరట్‌లోని మాధవాపురానికి  చెందిన పూజ (పేరు మార్చబడింది) అనే యువతి స్థానిక  మొబైల్ దుకాణంలో పనిచేస్తుంది.   పూజ తన ప్రియుడిని తనకు కాకుండా  చేస్తోందని ఆర్తి (పేరు మార్చబడింది)  అనే మరో  యువతి ఆరోపించింది.

గురువారం పూజ ...యువకుడితో కలిసి మొబైల్‌ దుకాణానికి వెళ్తుండగా ఆర్తి  అడ్డుకుంది. తన బాయ్ఫ్రెండ్కు దూరంగా వుండాలని హెచ్చరించింది. అయినా..ఆర్తి మాటలను పూజ పట్టించుకోలేదు. వారిద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది.  దీంతో ఆగ్రహానికి గురైన ఆర్తి..పూజను రోడ్డు మీదనే కొట్టింది. తన ప్రియుడికి దూరంగా ఉండకపోతే ఫలితం దారుణంగా ఉంటుందని బెదిరించింది. పలువురు ఇద్దరు యువతులను విడదీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.  మరోవైపు  వీరిద్దరూ అలా ఒకరినొకరు కొట్టుకుంటుంటే సందట్లో సడేమియాలాగా స్థానికులు ఆ దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement