లక్నో: ఖైనీ అమ్మనందుకు ఓ దుకాణదారుడి ఇంటిపై ఆగంతుకులు కాల్పులకు తెగబడిన సంఘటన మీరట్‌లోని భైంసా గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు అలిసన్ మాట్లాడుతూ.. ‘నేను ఇంట్లోనే కిరాణ దుకాణం నడుపుతున్నాను. ఈ క్రమంలో గురువారం సాయంత్రం షాప్ మూసేశాను. ఇంతలో లోకేంద్ర మా ఇంటికి వచ్చి ఖైనీ కావాలని అడిగాడు. దుకాణం మూసి వేశాను. ఇవ్వడం కుదరదని చెప్పి, వెళ్లి పొమ్మన్నాను. అతడు వెళ్లకుండా నాతో గొడవపడ్డాడు. దాంతో నేను ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాను. కాసేపటి తర్వాత లోకేంద్ర ఓ 10 మంది వ్యక్తులను తీసుకుని నా ఇంటి మీదకు వచ్చాడు. అందరి చేతుల్లో తుపాకులు ఉన్నాయ’న్నాడు అలీసన్.
అలీసన్ మాట్లాడుతూ.. ‘వారిలో కొందరు మా ఇంటి మీద కాల్పులకు తెగబడ్డారు. సుమారు మూడు రౌండ్లు మా ఇంటి మీద కాల్పులు జరిపారు. గేటుకు పెద్ద రంధ్రం పడింది. అదృష్టం బాగుండి మేం తప్పించుకోగలిగాము’ అని చెప్పాడు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. లోకేంద్ర, అతడి స్నేహితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment