మీరట్: ఎన్ని చట్టాలు వచ్చినా...ఎన్ని హక్కులు ఉన్నా...వాటికీ విలువ లేకుండా పోతుంది. చదువకున్నవాళ్లు సైతం పరువు, ప్రతిష్ట అంటూ.....నిండు ప్రాణాలను బలిచేయడంతో పాటు...వాళ్ల జీవితాలను నాశనం చేసేసుకుంటున్నారు. అలాంటి ఘటనే మీరట్‌లోని సర్ధనా ప్రాంతంలో చోటు చేసుకుంది. చెల్లెలు ఎవరితోనో సంబంధం పెట్టుకుందన్న కక్షతో ఆమెను హత్యచేశాడో అన్న..
వివరాల్లోకెళ్తే..మృతిరాలి తల్లి షహనో తన భర్త నుంచి విడాకులు తీసుకుని తల్లిదండ్రులతో కలిసి ఉండేది. ఆమెకు ఆరీప్, సమీరన్ ఇద్దరూ పిల్లలు. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవడంతో పిల్లలు ఆమె తండ్రి వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలో సమీరన్ స్థానిక వ్యక్తితో చనువుగా ఉంటుంది. కుటుంబ సభ్యులు ఆ వ్యక్తికి దూరంగా ఉండమని సూచించారు. కానీ ఆమె అంతగా పట్టించుకోకుండా అలానే కొనసాగించింది. దీంతో ఆమె సోదరుడు ఆగ్రహంతో ఆమె నిదురుస్తున్న సమయంలో దేశీయ తుపాకీతో కాల్చి చంపేశారు. ఆ తర్వాత స్థానిక పోలీస్టేషన్‌కీ వెళ్లి లొంగిపోయాడు. మృతురాలిని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించి, అతని పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment