ఏపీ హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్‌ విచారణ | Ram Gopal Varma Petition Dismissed By AP High Court | Sakshi
Sakshi News home page

ఏపీ హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్‌ విచారణ

Published Mon, Nov 18 2024 11:59 AM | Last Updated on Mon, Nov 18 2024 3:54 PM

Ram Gopal Varma Petition Dismissed By AP High Court

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులో అరెస్ట్‌ నుంచి రక్షణల్పించాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అయితే.. తనపై నమోదైన కేసు కొట్టేయాలన్న పిటిషన్‌ను మాత్రం విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కౌంటర్‌ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. 

రామ్‌ గోపాల్‌ వర్మ అభ్యర్థనపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల నుంచి అరెస్టు ఆందోళన ఉంటే బెయిల్‌ పిటిషన్‌ వేసుకోవాలని కోర్టు సూచించింది. ఈ క్రమంలోనే పోలీసుల విచారణకు తనకు మరికొంత సమయమిచ్చేలా ఆదేశించాలని కోర్టును ఆయన కోరారు. ఆ అభ్యర్థనను కూడా పోలీసులు ముందు చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలని వేసిన ఆర్జీవీ వేసిన పిటిషన్‌ను రెండు వారాల తర్వాతే విచారణ జరపనుంది. 

ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. 'వ్యూహం' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో నవంబర్‌ 19న పోలీసుల విచారణలో వర్మ పాల్గొనాల్సి ఉంది.

	Ram Gopal Varma: ఏపీ హైకోర్టులో పిటిషన్ పై విచారణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement