కోడి పందేల ముఠా అరెస్ట్‌ | Five Arrested For Betting, Cockfighting | Sakshi
Sakshi News home page

కోడి పందేల ముఠా అరెస్ట్‌

Published Mon, Apr 9 2018 9:32 AM | Last Updated on Mon, Apr 9 2018 9:32 AM

Five Arrested For Betting, Cockfighting - Sakshi

పోలీసుల అదుపులో పందెం రాయుళ్లు  

విశాఖ క్రైం: నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గుట్టుగా కోడి పందేలు నిర్వహిస్తున్న ముఠాని టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్ట్‌ చేశారు. టాస్క్‌ఫోర్సు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తాటిచెట్లపాలెం దరి లెప్రసీ కాలనీలోని బహిరంగ ప్రదేశంలో ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారంతో టాస్క్‌ఫోర్సు పోలీసులు దాడులు చేశారు.

ఈ దాడుల్లో నిర్వాహకుడు ఆనంద్‌ పరారయ్యాడు. అక్కడ ఉన్న మిగిలిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే 18 పందెం కోళ్లు, రూ.5వేలు, మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా ఏసీపీ చిట్టిబాబు మాట్లాడుతూ కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారంతో దాడులు చేశామన్నారు. దాడుల్లో ఎస్‌ఐలు సతీష్, మూర్తి సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement