సామాజిక స్థలం..పచ్చనేత బేరం | Social space ....TDP Leaders bargain | Sakshi
Sakshi News home page

సామాజిక స్థలం..పచ్చనేత బేరం

Published Wed, Apr 11 2018 10:25 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Social space ....TDP Leaders bargain - Sakshi

పంచాయతీ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఇల్లు

పట్టణంలో లక్షలాది రూపాయల విలువైన సామాజిక స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో అ«ధికార టీడీపీ నేతలు వీటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. లేఅవుట్లు వేసి సామాజిక అవసరాల కోసం పంచాయతీ వారికి కేటాయించిన  ఈ స్థలాలు బేరాలకు  పెడుతున్నారు.  

పాయకరావుపేట : పట్టణంలో లక్ష్మి థియేటర్‌ వెనుక పెదిరెడ్డి సన్యాసిరావునగర్‌లో వేసిన లేఅవుట్‌లో సామాజిక అవసరాల కోసం కేటాయించిన సుమారు రూ.10 లక్షల విలువైన స్థలాన్ని స్థానిక టీడీపీ నేత ఒకరు విక్రయించినట్టు ప్రచారం జరుగుతోంది.

ఈ స్థలంలో కొనుగోలు చేసిన వ్యక్తి యథేచ్ఛగా ఇంటి నిర్మాణం చేపట్టి స్లాబ్‌ వేసాడు. ఇంత జరుగుతున్నా పంచాయతీ అధికారులు చోద్యం చూస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే సర్వే నం 138/2లో కొద్దిపాటి భూమిని గతంలో లే అవుట్లుగా వేసి ప్లాట్లుగా విభజించి విక్రయించారు.

అప్పట్లో భూ యజమానులు సామాజిక అవసరాల కోసం కొంత స్థలాన్ని పంచాయతీకి కేటాయించారు.  పంచాయతీ వారు హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ భూమిని స్థానిక టీడీపీ నేత ఒకరు కొద్దిరోజుల క్రితం బేరం పెట్టేసారు.

రిజిస్ట్రేషన్‌ కూడా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి ఇంటి నిర్మాణం ప్రారంభించి స్లాబ్‌ వేసాడు. కానీ పంచాయతీ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement