కర్నూలులో ది విశాఖపట్టణం కో ఆపరేటివ్‌ బ్యాంకు | in kurnool vishakha co operative bank established | Sakshi
Sakshi News home page

కర్నూలులో ది విశాఖపట్టణం కో ఆపరేటివ్‌ బ్యాంకు

Published Mon, Oct 24 2016 12:16 AM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

in kurnool vishakha co operative bank established

–  ప్రారంభించిన రిజర్వు బ్యాంకు రీజినల్‌ డైరక్టర్‌
కర్నూలు(అగ్రికల్చర్‌): ది విశాఖపట్టణం కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు శాఖను ఆదివారం కర్నూలు నగరంలోని అలంకార్‌ ప్లాజాలో   రిజర్వు బ్యాంకు ఆప్‌ ఇండియా హైద్రాబాద్‌ రీజినల్‌ డైరక్టర్‌ ఆర్‌ఎన్‌ దాస్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏరాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ది విశాఖపట్టణం కో ఆపరేటివ్‌ బ్యాంకు ఏర్పాటై 101 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. ఈ బ్యాంకుపై రిజర్వు బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషి ఉంటుందని తెలిపారు.  బ్యాంకు చైర్మన్‌ చలసాని రాఘవేంద్రరావు మాట్లాడుతూ....ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 11 జిల్లాల్లో బ్రాంచిలు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. 43వ బ్రాంచిని కర్నూలులో ప్రారంబించినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. వాణిజ్య బ్యాంకులకు దీటుగా అన్ని రకాల రుణాలు ఇస్తామని తెలిపారు.  కార్యక్రమంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి దాసరి శ్రీనివాసులు, జిల్లా సహకార అధికారి సుబ్బారావు, బ్యాంకు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement