
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శనివారం ఐటీ హబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతన ఐటీ పాలసీ రూపకల్పనపై దృష్టి సారించామన్నారు. ఇందుకోసం 100 రోజుల కార్యచరణని సిద్ధం చేశామన్నారు. గత ప్రభుత్వం ఐటీని నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు. బెంగళూరు, హైదరాబాద్‌కు ధీటుగా విశాఖలో ఐటీని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లలో జరిగిన భూ కేటాయింపులపై సమీక్షిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment