మీ మీద అరిచీ.. అరిచీ.. నా గొంతు పోయింది: రోహిత్‌ అసహనం | Ind Vs Eng Mere Gale ka Waat Lag Gaya: Rohit Sharma Stump Mic Rant | Sakshi
Sakshi News home page

అరిచీ.. అరిచీ.. నా గొంతు పోయింది: రోహిత్‌ శర్మ వ్యాఖ్యలు వైరల్‌

Published Wed, Feb 7 2024 12:21 PM | Last Updated on Wed, Feb 7 2024 1:15 PM

Ind Vs Eng Mere Gale ka Waat Lag Gaya: Rohit Sharma Stump Mic Rant - Sakshi

India vs England Test Series 2024: ఇంగ్లండ్‌తో మొదటి టెస్టులో ఓటమి వల్ల విమర్శల పాలైన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. రెండో మ్యాచ్‌లో జట్టును గెలిపించి సత్తా చాటాడు. విశాఖపట్నం టెస్టులో బ్యాటర్‌గా విఫలమైనా సారథిగా రోహిత్‌కు మంచి మార్కులే పడ్డాయి.

ముఖ్యంగా.. ఎప్పుటికప్పుడు ఫీల్డర్లను అలర్ట్‌ చేస్తూ.. పరిస్థితులకు తగ్గట్లుగా ఫీల్డ్‌ సెట్‌ చేస్తూ  హిట్‌మ్యాన్‌ వ్యవహరించిన తీరు అభిమానులను ఆకర్షించింది. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ.. సహచర ఆటగాళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తాజాగా నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

106 పరుగుల తేడాతో ఘన విజయం
హైదరాబాద్‌లో ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఓడిన టీమిండియా.. విశాఖలో 106 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. నాలుగో రోజు దాకా సాగిన ఆటలో ఆఖరికి పైచేయి సాధించి ఈ మేరకు గెలుపు బోణీ కొట్టింది.

అయితే, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా కొందరు ఫీల్డర్లు బద్దకంగా కదలడంతో రోహిత్‌ కాస్త గట్టిగానే వారిపై అరిచాడు. సోమవారం నాలుగో రోజు ఆట సందర్భంగా.. ఇంగ్లండ్‌ 157/4 వద్ద ఉన్న సమయంలో రోహిత్‌ మాట్లాడిన మాటలు స్టంప్‌ మైకులో రికార్డయ్యాయి.

అరిచీ.. అరిచీ నా గొంతు పోతోంది
ఇందులో.. ‘‘మీ మీద అరిచీ.. అరిచీ నా గొంతు పోతోంది’’ అంటూ సహచర ఆటగాళ్లను ఉద్దేశించి రోహిత్‌ అన్నట్లుగా వినిపించింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా విశాఖలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా విధించిన 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఇంగ్లండ్‌ భారీ తేడాతో ఓడిపోయింది.

ఈ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.  ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ శర్మ.. బుమ్రాను చాంపియన్‌ ప్లేయర్‌ అంటూ ప్రశంసించాడు. సమిష్టి ప్రదర్శనతో తమకు విజయం సాధ్యమైందని పేర్కొన్నాడు. 

చదవండి: Ind vs Eng: ఛాన్స్‌ ఇస్తే ఇలాగేనా ఆడేది?.. ఎందుకంత తొందర?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement