సాక్షి, విశాఖపట్నం: రెండో టెస్టు కోసం టీమిండియా- ఇంగ్లండ్ జట్లు మంగళవారం విశాఖపట్నం చేరుకున్నాయి. ఈ క్రమంలో క్రికెటర్లను నేరుగా చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. తమ అభిమాన ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికారు. దూరం నుంచే వారిని పలకరిస్తూ మురిసిపోయారు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రోహిత్ సేన- స్టోక్స్ బృందం మధ్య తొలి టెస్టుకు హైదరాబాద్ వేదికైంది.
హైదరాబాద్‌లో ఓటమిపాలై
ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఇంగ్లండ్ 1-0తో సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. విశాఖలోని డాక్టర్ వైస్ రాజశేఖర్‌రెడ్డి క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.
విశాఖలో విజయమే లక్ష్యంగా
ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులకు కూడా ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించనుంది. అదే విధంగా.. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రోజుకు 2 వేల మంది చొప్పున 5 రోజులకు 10 వేల మంది విద్యార్థులకు ఏసీఏ ఉచిత ప్రవేశం కల్పించనుంది. అంతేగాకుండా.. రాష్ట్రంలో ఉన్న క్లబ్ క్రీడాకారులు కూడా.. రోజుకు 2,850 మంది చొప్పున.. 5 రోజులకు 14,250 మంది ఫ్రీగా మ్యాచ్ చూసే అవకాశం ఇవ్వనుంది.
ఇదిలా ఉంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ అమ్మమ్మగారి ఊరైన వైజాగ్‌లో గెలుపే లక్ష్యంగా టీమిండియా సన్నద్ధమవుతోంది. సిరీస్‌ను 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది. అయితే, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరం కావడం ప్రభావం చూపే అవకాశం ఉంది.
చదవండి: Ind vs Eng: రోహిత్ కూడా చెప్పాడు..! తుదిజట్టులో సిరాజ్ అవసరమా?
Comments
Please login to add a commentAdd a comment