
సాక్షి, విశాఖపట్నం: కరోనా మహమ్మారి కట్టడిలో అధికారుల పనితీరు ప్రశంసనీయమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా కట్టడి కోసం కలెక్టర్ వినయ్ చంద్ ఏర్పాటు చేసిన 21 కమిటీలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. విశాఖ జిల్లాలో రెడ్‌జోన్లపకై మరింత దృష్టి సారించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రావోద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు చెప్పారు. పేదల కోసం ప్రభుత్వం నుంచి మరిన్ని సహాయ కార్యక్రమాలు చేపట్టామన్నారు. పేదలను అన్ని విధాలా ఆదుకోవాలిని సీఎం జగన్ సూచించారని మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment