Visakha Collector
-
విశాఖ కలెక్టర్ వ్యక్తిగత హాజరుకు హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: విశాఖపట్నం జిల్లా సబ్బవరం గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలన్న తమ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైనందుకు విశాఖ జిల్లా కలెక్టర్ జనవరి 3వ తేదీన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సబ్బవరంలోని 255, 272, 277 సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిలో కె.దుర్గాప్రసాద్ అనే వ్యక్తి అధికారులతో కుమ్మక్కై నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఎస్.చినవెంకటేశ్వర్లు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. విచారణ జరిపిన సీజే ధర్మాసనం ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని కలెక్టర్‌ను ఆదేశిస్తూ గత ఏడాది ఉత్తర్వులిచ్చింది. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చింది. కోర్టు ఆదేశాలున్నా ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు కొనసాగుతున్నాయని పిటిషనర్ న్యాయవాది ఎన్.హెచ్.అక్బర్ తెలిపారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారంటూ, అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలను ధర్మాసనం ముందుంచారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం కలెక్టర్‌పై మండిపడింది. -
‘కరోనాపై మూడంచెల వ్యవస్థతో జాగ్రత్తలు’
సాక్షి, విశాఖపట్నం: కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా విషమ పరిస్థితుల్లో ఉన్న రోగుల కోసం జిల్లాలో 7 వేలకు పైగా అత్యవసర బెడ్స్‌ను సిద్దం చేస్తున్నామని విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. మెడికల్ అసోషియేషన్ ప్రతినిధులతో కలెక్టర్ శనివారం సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోజురోజుకి కరోనా తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో రెండు, మూడు నెలల కార్యచరణను మరో 2,3 రోజుల్లో సిద్దం చేస్తున్నామని చెప్పారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో మూడంచెల వ్యవస్ధ ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకొనున్నామన్నారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న పేషేంట్ల కోసం ప్రత్యేకంగా వైద్య నిపుణులతో కూడిన టెలీ మెడిసిన్ సెంటర్‌ని అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. ప్రత్యేక వైద్య చికిత్స అందించాల్సి ఉన్న కరోనా పేషేంట్లను మాత్రమే కోవిడ్ ఆసుపత్రులకి తరలిస్తామని తెలిపారు. అత్యవసర పరిస్ధితుల కోసం సుమారు 15 లక్షల వ్యయంతో పది డిజిటల్ ఎక్స్‌రే మిషన్లు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే కోవిడ్ ఆసుపత్రులు, సెంటర్లలో నాణ్యమైన భోజన సదుపాయాలు అందించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. కొత్త మార్గదర్శకాల ఆధారంగా భోజనం మరింత నాణ్యత ఉండేలా ఒక్కొక్క కాంట్రాక్టర్‌కి ఒక సెంటర్ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉన్నామన్నారు. విశాఖలో డి టైప్ ఆక్సిజన్ సిలిండర్లకు కొరత లేదని ఈ సందర్భంగా కలెక్టర్ స్ఫష్టం చేశారు. -
కరోనా: ‘ఆ కమిటీ మంచి ఫలితాలను ఇస్తుంది’
సాక్షి, విశాఖపట్నం: కరోనా మహమ్మారి కట్టడిలో అధికారుల పనితీరు ప్రశంసనీయమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా కట్టడి కోసం కలెక్టర్ వినయ్ చంద్ ఏర్పాటు చేసిన 21 కమిటీలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. విశాఖ జిల్లాలో రెడ్జోన్లపకై మరింత దృష్టి సారించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రావోద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు చెప్పారు. పేదల కోసం ప్రభుత్వం నుంచి మరిన్ని సహాయ కార్యక్రమాలు చేపట్టామన్నారు. పేదలను అన్ని విధాలా ఆదుకోవాలిని సీఎం జగన్ సూచించారని మంత్రి పేర్కొన్నారు. -
పారదర్శకంగా భూ సమీకరణ..
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో భూ సమీకరణ పారదర్శకంగా జరుగుతోందని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. అర్హులైన అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం మేరకు జిల్లాలో ఆరు వేల ఎకరాల భూ సమీకరణ చేస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో సెంట్ల భూమిని ఇళ్లు నిర్మాణం కోసం అర్హులైన పేదలకు కేటాయిస్తున్నట్లు వివరించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం భూ సేకరణ చేస్తున్నామని అదంతా పూర్తిగా ప్రభుత్వ భూమిలో మాత్రమే జరుగుతోందన్నారు. దీనికోసం నిర్దిష్టమైన లే అవుట్లు కూడా రూపొందించడమే కాకుండా మార్చి 10 నాటికి పూర్తిస్థాయిలో ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రైతులకు నష్టం కలిగించం.. ప్రభుత్వ భూములను సాగుచేస్తున్న వ్యక్తులు కూడా నిర్దిష్టమైన ఆధారాలను బట్టి అభివృద్ధి చేసిన లే అవుట్లలో 900, 450 గజాల చొప్పున కేటాయించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ సిటీ లో ఇళ్ల కోసం రూ. 25 వేలు చొప్పున నగదు డిపాజిట్ చేసిన లబ్ధిదారులకు కేటాయింపు జరుగుతుందని వివరించారు. ఎక్కడ ప్రైవేట్ భూములు తీసుకోవడం కానీ, రైతులకు నష్టం కలిగించే రీతిలో భూ సేకరణ గాని సమీకరణ గాని ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. భూ సమీకరణ కోసం రూ.1300 కోట్లు.. గిరిజన ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు వచ్చాయని ఆయా ప్రాంతాల్లో వారికి భూములు కేటాయింపు జరుగుతుందని చెప్పారు. ప్రధానంగా ఏజెన్సీలో పాడేరు ప్రాంతంలో ఎక్కువగా ప్రభుత్వ భూమి ఉండడంతో ఆ ప్రాంతంలో ఎక్కువ మందికి ఇళ్ల స్థలాలు కేటాయింపు జరుగుతుందన్నారు. పినగాడి లో పేదల కోసం రూపొందిస్తున్న లే అవుట్ లో మా భూమి పూర్తిగా ప్రభుత్వ ఖాళీ స్థలం గా చెప్పారు. రైతులకు ఇబ్బంది కలిగించే రీతిలో ఎక్కడ భూమి తీసుకోవడం లేదన్నారు. రైతులకు భూ సమీకరణ కింద ఇచ్చే ప్రతి రూపాయి నేరుగా వారి ఖాతాలోనే వేస్తున్నామ ని చెప్పారు.. భూసమీకరణ కోసం రూ. 1300 కోట్లు ప్రభుత్వం నిర్దేశించిందని కలెక్టర్ వెల్లడించారు. -
విశాఖ అభివృద్ధిపై కలెక్టర్ నివేదిక
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరం అభివృద్ధి పనులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ సోమవారం నివేదిక సమర్పించారు. నగర శివారు ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం రూ.240 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. ఇంటింటికి కుళాయి పథకం, ఏలూరు నీరు నిల్వ చేసేందుకు రూ.500 కోట్లతో రిజర్వాయర్ల మార్పునకు ప్రతిపాదనలు చేశారు. విశాఖలో మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే కలెక్టర్‌ను వివరాలు కోరారు. కాగా, విశాఖలో సీ హారియర్ మ్యూజియం నిర్మాణానికి త్వరలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. -
కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు ఊరట
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పూర్వ కమిషనర్, ప్రస్తుత జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు హైకోర్టు ఊరటనిచ్చింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారంటూ కోర్టు ధిక్కార కేసులో ఆయనకు నెల రోజుల జైలుశిక్ష, రూ.1500 జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును ధర్మాసనం నిలిపేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖకు చెందిన జుపిటర్ ఆటోమొబైల్స్ వాల్తేర్‌లో తాము చేపట్టిన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసేలా జీవీఎంసీని ఆదేశించాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు జుపిటర్ ఆటోమొబైల్స్‌కు భవన నిర్మాణ అనుమతినివ్వాలంటూ జీవీఎంసీని ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో సదరు సంస్థ జీవీఎంసీ అప్పటి కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రామచంద్రరావు జీవీఎంసీ కమిషనర్ తీరును తప్పుపట్టారు. కమిషనర్ ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని తేల్చారు. ఇందుకు గాను కోర్టు ధిక్కారం కింది కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌కు నెల రోజుల జైలుశిక్ష, రూ.1500 జరిమానా విధిస్తూ ఇటీవల తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై అప్పీల్ దాఖలు చేసేందుకు వీలుగా తీర్పు అమలును నాలుగు వారాల పాటు నిలిపేశారు. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ ప్రవీణ్‌కుమార్ ఏసీజే నేతత్వంలోని ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. కమిషనర్ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హాజరయ్యారు. సింగిల్ జడ్జి తీర్పు గురించి ఏజీ వివరించారు. అనంతరం ఆ తీర్పు అమలును నిలిపేస్తూ ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ మేర మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తా
విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సాక్షి, విశాఖపట్నం: కోర్టు ఆదేశాల మేరకే జూపిటర్ ఆటోమొబైల్స్ సంస్థకు భవన నిర్మాణం కోసం షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశామని విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. జీవీఎంసీ కమిషనర్‌గా ఉన్న సమయంలో కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ప్రవీణ్‌కుమార్‌కు హైకోర్టు 30 రోజుల జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆదివారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. జూపిటర్ ఆటో మొబైల్స్ సంస్థ భవన నిర్మాణానికి 2009లో దరఖాస్తు చేసిందని, వివిధ కారణాల వల్ల జాప్యం జరగ్గా ఆ సంస్థ కోర్టును ఆశ్రయించిందన్నారు. విశాఖ కలెక్టర్‌కు జైలుశిక్ష ఆ సంస్థకు నాలుగు వారాల్లో అనుమతులు మంజూరు చేయాలని హైకోర్టు 2014 డిసెంబర్లో ఆదేశించిన విషయం వాస్తవమేనన్నారు. అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించకపోవడంతో అనుమతుల మంజూరులో జాప్యం జరిగిందని, అన్ని పత్రాలు సమర్పించిన తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు అనుమతులు మంజూరు చేశామన్నారు. హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తానని స్పష్టంచేశారు. -
విశాఖ కలెక్టర్‌కు జైలుశిక్ష
సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కార కేసులో గ్రేటర్ విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పూర్వ కమిషనర్, ప్రస్తుత జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు ఉమ్మడి హైకోర్టు జైలుశిక్ష విధించింది. ఉద్దేశ పూర్వకంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఆయనకు 30 రోజుల సాధారణ జైలుశిక్ష, రూ.1,500 జరిమానా విధించింది. 4 వారాల్లో జరిమానా చెల్లిం చాలని, లేకుంటే మరో నెలపాటు జైలుశిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. దీనిపై అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుగా ఈ తీర్పు అమలును 4 వారాల పాటు నిలుపుదల చేసింది. జైలుశిక్ష అనుభవించే సమయంలో ప్రవీణ్ కుమార్‌కు రోజుకు రూ.300 జీవన భృతి కింద చెల్లించాలని అధికారులను ఆదే శించింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీ వల తీర్పు చెప్పారు. విశాఖకు చెందిన జుపిటర్ ఆటోమొబైల్స్ వాల్తేర్ వార్డు లోని ప్లాట్ నంబరు 44లో భవన నిర్మాణం నిమిత్తం జీవీఎంసీకి 2009లో చేసుకున్న దరఖాస్తును జీవీఎంసీ అధి కారులు తిరస్కరించారు. దీన్ని సవాలు చేస్తూ జుపిటర్ ఆటోమొబైల్స్ హైకోర్టులో వేర్వేరు సంవత్సరాల్లో పలు పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై విచారణ జరిపిన జస్టిస్ రామచంద్రరావు.. భవన నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని ఆదేశిం చినా దరఖాస్తును జీవీఎంసీ అధికారులు తిరస్కరించారు. దీంతో జుపిటర్ జీవీఎంసీ అప్పటి కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. -
అసిస్టెంట్ కమిషనర్‌పై చర్యలు!
► విశాఖలో కొనసాగించబోమన్న కమిషనర్ ► కలెక్టర్ సమక్షంలో హామీ ► ఆందోళన విరమించిన దేవాదాయ ఉద్యోగులు సాక్షి, విశాఖపట్నం : దేవాదాయ, ధర్మాదాయశాఖ కార్యనిర్వహణాధికారులు, ఉద్యోగులు ఆందోళన విరమించారు. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఇ.వి.పుష్పవర్థన్ వేధింపులకు నిరసనగా నాలుగు రోజుల నుంచి వీరంతా సామూహిక సెలవులో ఉన్నారు. విధులను బహిష్కరించి వివిధ రకాలుగా ఆందోళనలు చేస్తున్నారు. ఏసీ పుష్పవర్థన్ పై చర్యలు తీసుకోవాలని, ఇక్కడ నుంచి బదిలీ చేయాలని వీరు డిమాండ్ చేస్తూ తొలుత ఆ శాఖ కమిషనర్ వై.వి.అనురాధకు, ఆ తర్వాత విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబుకు విన్నవించారు. దీనిపై కమిషనర్ అనురాధ రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ)తో విచారణకు ఆదేశించారు. అలాగే ముఖ్యమంత్రి కూడా ఈ వివాదాన్ని పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఇందులోభాగంగా శుక్రవారం ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ విచారణ చేపట్టారు. శనివారం కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో దేవాదాయశాఖ డిప్యూటి కమిషనర్ ఎన్.వి.ఎస్.ఎన్.మూర్తి సహా, ఈవోలు, ఉద్యోగులతో సమావేశమయ్యారు. కమిషనర్ అనురాధతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు. సహాయ కమిషనర్ పుష్పవర్థన్ ఈనెల 12 వరకు సెలవులో ఉన్నారని, అనంతరం ఆయనను విశాఖ నుంచి బదిలీ చేస్తామని, ఇక్కడ కొనసాగించబోమని హామీ ఇచ్చారు. అందువల్ల ఉద్యోగులు నిర్భయంగా విధులు నిర్వహించుకోవచ్చని చెప్పారు. దీంతో ఉద్యోగులు, ఈవోలు చర్చించుకున్నారు. 12 తర్వాత ఏసీపై చర్యలు తీసుకోని పక్షంలో 13వ తేదీ నుంచి మళ్లీ ఆందోళన కొనసాగిస్తామని కలెక్టర్‌కు స్పష్టం చేశారు. కాగా కమిషనర్ హామీతో విజయదశమి పండగను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఇబ్బంది కలగకుండా తామంతా తిరిగి విధులకు హాజరవుతున్నామని జిల్లా దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారుల సంఘం అధ్యక్షుడు ఎ.జగన్నాధరావు ’సాక్షి’కి చెప్పారు. కలెక్టర్‌తో సమావేశమైన వారిలో ఈవోలు జగన్నాధరావు, ఎ¯ŒS.ఎల్.ఎస్.శాస్తి్ర, పి.శేఖర్‌బాబు, పీఎస్.ఎన్ మూర్తి, దేవాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధి జి.కృష్ణమాచారి తదితరులున్నారు.