
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరం అభివృద్ధి పనులను సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ సోమవారం నివేదిక సమర్పించారు. నగర శివారు ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం రూ.240 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. ఇంటింటికి కుళాయి పథకం, ఏలూరు నీరు నిల్వ చేసేందుకు రూ.500 కోట్లతో రిజర్వాయర్ల మార్పునకు ప్రతిపాదనలు చేశారు. విశాఖలో మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే కలెక్టర్‌ను వివరాలు కోరారు. కాగా, విశాఖలో సీ హారియర్ మ్యూజియం నిర్మాణానికి త్వరలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు.