visakha development
-
విశాఖలో చంద్రబాబు చేసిన అరాచకాలు..
-
విశాఖ వైపు ‘మెట్రో’ పరుగులు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా మారబోతున్న విశాఖ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజారవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. నగరంలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం ప్రతిబింబించేలా మెట్రో పిల్లర్లు నిర్మాణం చేపట్టే దిశగా ఆలోచన చేస్తోంది. మరోవైపు తొలి విడతలో 76.90 కి.మీ. మేర లైట్ మెట్రో నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈలోగా నిధుల సమీకరణను వేగవంతం చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి మెట్రో రైల్ కార్పొరేషన్‌కు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రజారవాణా వ్యవస్థ మెరుగుదలపై దృష్టి 2021 అంచనాల ప్రకారం విశాఖ మహా నగరంలో 25 లక్షలకు పైగా జనాభా ఉంది. మెట్రో నిర్మాణ ప్రతిపాదనలు ఉన్న శివారు ప్రాంతాలతో కలిపితే మొత్తం జనాభా 41 లక్షలు. అందుకే తప్పనిసరిగా మెట్రో రైలు అవసరం. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లాభనష్టాలతో సంబంధం లేకుండా కేవలం ప్రజలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు మెట్రోపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దసరా తర్వాత విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించేందుకు అడుగులు పడుతున్న తరుణంలో నగరంలో ప్రజారవాణా వ్యవస్థ మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉంది. మెట్రో రైలు రాకతో ట్రాఫిక్ సమస్య తీరడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది. జనవరి 15న పునాది రాయి వచ్చే ఏడాది జనవరి 15న మెట్రో రైలు పనులకు పునాది రాయి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల విశాఖలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి నిర్వహించిన అభివృద్ధి పనుల సమీక్షలో మెట్రో రైలు నిర్మాణ అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. పునాది రాయి వేసేలోగా నిధులు సమీకరించేందుకు ఉన్న మార్గాల్ని అన్వేషించాలని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ యూజేఎం రావుకు సూచించారు. 42 మెట్రో స్టేషన్లతో కూడిన మూడు కారిడార్లను మొదటి దశలో నిర్మించాలని భావిస్తున్నారు. కారిడార్–1లో స్టీల్‌ప్లాంట్ గేట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు 34.40 కి.మీ., కారిడార్–2లో గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5.07 కి.మీ., కారిడార్–3లో భాగంగా తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకూ 6.75 కి.మీ. మేర లైట్ మెట్రో కారిడార్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆ తరువాత రెండో విడత కింద కారిడార్–4లో కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు 30.67 కి.మీ. మేర నిర్మించనున్నారు. ఈ నాలుగు కారిడార్లలో మొత్తం 54 స్టేషన్లు, రెండు డిపోలు ఏర్పాటు చేయనున్నారు. బీచ్ రోడ్డులో ట్రామ్ కారిడార్ బీచ్ రోడ్డులో ట్రామ్ కారిడార్ ఒక మణిహారంగా రాబోతోంది. ప్రధాన జంక్షన్ల నుంచి అభివృద్ధి చెందే ప్రాంతాలకు కూడా ట్రామ్ నడిపే యోచనలో ప్రభుత్వం ఉంది. మొత్తం 60.05 కి.మీ. మేర మోడ్రన్ ట్రామ్ని నడిపేందుకు 4 కారిడార్లు గుర్తించారు. కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ ట్రామ్ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా స్టీల్‌ప్లాంట్ నుంచి అనకాపల్లి, ఎన్ఏడీ జంక్షన్ నుంచి పెందుర్తి వరకు కూడా ట్రామ్ కారిడార్ రాబోతోంది. శివారుకు మెట్రో.. సీఎం ఆకాంక్ష ఏపీ ఎగ్జిక్యూటివ్, ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా, ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో శివారు ప్రాంతాలు కూడా కోర్ సిటీకి సమానంగా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు అవసరం. అందుకే ఆయా ప్రాంతాలకు మెట్రో సౌకర్యం కూడా కల్పించాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. అందుకు అనుగుణంగా డీపీఆర్‌లో మార్పులు, చేర్పులు జరిగాయి. -
ఐటీ హబ్‌గా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: ఐటీ హబ్‌గా విశాఖ అభివృద్ధి చెందనుందని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు చెప్పారు. ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ త్వరలోనే విశాఖలో తన కార్యకలాపాలను ప్రారంభించనుందని తెలిపారు. వైఎస్సార్ హయాంలో విశాఖలో ఐటీకీ జీవం పోస్తే.. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఐటీ అభివృద్ధి పరుగులు పెడుతోందని ప్రశంసించారు. ఎండాడ సమీపంలో ఐటీ సెజ్ హిల్ నంబర్–2లో ఇన్ఫోసిస్ సంస్థ ఏర్పాటు కానున్న నూతన భవనాన్ని బుధవారం ఇన్ఫోసిస్ ప్రతినిధులతో కలిసి వారు పరిశీలించారు. అనంతరం ఇన్ఫోసిస్ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. సమావేశంలో ఇన్ఫోసిస్ సంస్థ మౌలిక సదుపాయాల విభాగం వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్ నీలాద్రి ప్రసాద్మిశ్రా, మౌలిక సదుపాయాల అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పునీత్ దేశాయ్, మౌలిక సదుపాయాల రీజినల్ హెడ్ కులకర్ణి, సంస్థ ఇతర ప్రతినిధులు జయచంద్రన్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇన్ఫోసిస్ కంపెనీ కార్యకలాపాలకు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు. సంస్థ ప్రారంభోత్సవ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు ఉన్నారు. -
పరిపాలన రాజధానిగా విశాఖ కావడం తథ్యం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పరిపాలన రాజధాని కావడం తథ్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతవాసులెవరైనా అడ్డుకుంటే చరిత్రహీనులుగా నిలిచిపోతారన్నారు. ఆయన గురువారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 26 జిల్లాలు అభివృద్ధి చెందాలని సీఎం వైఎస్ జగన్ విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తుంటే.. అది వద్దంటూ రైతుల ముసుగులో టీడీపీ అమరావతి–అరసవల్లి యాత్ర చేస్తోందని చెప్పారు. రాజకీయ పార్టీలు సమీక్ష నిర్వహించుకోవడం ఆనవాయితీ అని, తమ పార్టీ అధ్యక్షుడు కూడా ఆ విధంగానే సమీక్షించారని చెప్పారు. దీనిపై పచ్చపత్రికలు ఏదేదో రాశాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 98.44 శాతం అమలు చేశామని, సీపీఎస్ వంటి వాటిపై చర్చలు జరుగుతున్నాయని వివరించారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లకు 175 గెలిచి తీరతామని పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అపర జ్ఞానిలా, అంతా ఆయనకే తెలుసన్నట్లుగా, తాము దద్దమ్మలన్నట్లు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. మనిషిగా పెరిగాడేగానీ బుర్ర ఎదగలేదన్నారు. ‘నువ్వు మంత్రిగా పనిచేశావు కదా? మరి ఈ మూడు జిల్లాల్లో ఏంచేశావో.. నీ మార్క్ ఏమిటో చెప్పండి. అలాగే మున్సిపల్ మంత్రిగా టీడీపీ హయాంలో బండారు సత్యనారాయణమూర్తి పనిచేశారు. ఆయనైనా తన మార్క్ ఏమిటన్నది చెబుతారా?’ అని నిలదీశారు. ప్రభుత్వ కార్యాలయం నిర్మిస్తే తప్పేంటి? ‘రుషికొండలో హరిత రిసార్టు ఉండేది. అది పాతబడిపోతే దానిస్థానంలో కొత్త గెస్ట్‌హౌస్ నిర్మిద్దామని ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపడితే... దానిమీద కూడా రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వం అక్కడ మరో గెస్ట్‌హౌస్ కడితే తప్పేమిటి? అక్కడ ప్రభుత్వ కార్యాలయం, సీఎం అధికార నివాసం కడితే తప్పేమిటి? గతంలో హైదరాబాద్‌లో నాటి సీఎం వైఎస్సార్ అధికార నివాసం నిర్మించారు. ఆ తర్వాత కేసీఆర్ వచ్చాక మరో భవనం కట్టారు. ఎవరు సీఎంగా ఉన్నా అవి అ«ధికార నివాసంగా ఉంటాయి. రుషికొండ మీద ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ ప్రభుత్వ కార్యాలయం, గెస్ట్‌హౌస్ కడితే తప్పేమిటి?..’ అని పేర్కొన్నారు. ‘ఏదైనా పర్యావరణ సమస్య ఉంటే సంబంధిత అధికారులు చూసుకుంటారు. ప్రభుత్వంలో ఎవరున్నా ఈ భవ నంలో ఉంటారు. పాలనందిస్తారు. ప్రైవేట్ వాళ్లకి అప్పగించలేదు కదా రాద్ధాంతం చేయడానికి..’ అని చెప్పారు. కొన్ని దుష్టశక్తులు ప్రతి మంచిపనిని అడ్డుకుంటున్నాయని, అదే గోప్యంగా ఉంచడానికి కారణమన్నారు. అఖిలపక్షాలను రుషికొండ మీదకి తీసుకెళతామని, దాపరికమేమీ ఉండదన్నారు. మీది రియల్ ఎస్టేట్ వ్యాపారం ‘టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకొంటున్నారు. ల్యాండ్ పూలింగ్ అనేది కొత్త కార్యక్రమం కాదు. గతంలో మహానేత వైఎస్సార్ కూడా చేశారు. ఇటీవలే మా ప్రభుత్వం ఇక్కడ పేదల ఇళ్లకోసం దాదాపు ఆరువేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి, డెవలప్ చేసి ఇచ్చింది. అదేమీ కొత్త స్కీం కాదే. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడం కోసం తప్ప చేసిందేముందు. అది వాస్తవం కాదా.. అందుకే మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. ఇక్కడ కూడా ఎవరో ఒకరు మాట్లాడతారు. వీటివల్ల రాజకీయాలు పలచన అవుతాయి. రాజకీయ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. భాష మీద అదుపు, విషయం మీద పట్టు ఉండాలి. హుద్‌హుద్ సమయంలో విపత్తు పేరు చెప్పి రికార్డులు తారుమారు చేసి మరీ భూములు దోచుకుతిన్నది మీరు కాదా?..’ అని టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఏపీలో కన్నా తెలంగాణాలోనే టీచర్లకు అన్ని బెనిఫిట్లు కల్పిస్తున్నామని తెలంగాణ మంత్రి హరీష్‌రావు అన్న మాటను విలేకరులు ప్రస్తావించగా, బొత్స మాట్లాడుతూ ఏపీ, తెలంగాణల్లో టీచర్లకు పీఆర్సీ, ఎంప్లాయి బెనిఫిట్, ఫిట్‌మెంట్‌లలో ఎవరికి ఎక్కువ వస్తున్నాయో పరిశీలించమనండని సూచించారు. -
ప్రభుత్వ భూముల్లోనే పరిపాలన రాజధాని
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ప్రభుత్వ భూముల్లోనే రాజధాని నిర్మాణం ఉంటుందని, అమరావతి మాదిరిగా ప్రైవేట్ భూములు విశాఖ రాజధానికి అవసరం లేదని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టంచేశారు. విశాఖపట్నంలో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని, ఆ పార్టీ నేతలు దోచుకున్న విలువైన భూములను తమ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుంటే.. భూములు దోచుకుంటున్నారు, ఆక్రమించుకుంటున్నారు.. అని చంద్రబాబు, లోకేశ్ గొంతుచించుకోవడం విడ్డురంగా ఉందని చెప్పారు. రెండేళ్ల పాలనలో తాముగానీ, తమ ఎమ్మెల్యేలుగానీ ఒక్క సెంటు భూమి కబ్జా చేసినట్లు తండ్రీకొడుకులు నిరూపించగలిగితే ఏ శిక్షకైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. విశాఖ ప్రజలు ఓట్లు వేసినందునే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా దక్కిందని, అది విశాఖ ప్రజలు పెట్టిన భిక్ష అని చెప్పారు. అలాంటి విశాఖ ప్రాంత అభివృద్ధినే అడ్డుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ ఆఫీసులను తనఖా పెడుతున్నారని, విశాఖను అమ్మేస్తున్నారని టీడీపీ నాయకులు విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వందల కోట్ల రూపాయల భూకబ్జాలకు పాల్పడిన పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు పార్టీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడిగా పెట్టుకున్నారని, ఇప్పుడు ఆయన్ని పార్టీ నుంచి డిస్మిస్ చేస్తారా.. కొనసాగిస్తారా.. అనేది చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉండగా విశాఖ భూములను వుడా ద్వారా అమ్మి, ఆ డబ్బులు తీసుకెళ్లి అప్పటి రాజధాని హైదరాబాద్‌లో ఖర్చుపెట్టారని, అప్పుడు టీడీపీ నేతలు ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు. విశాఖలో ఎన్ఏడీ ప్లైఓవర్‌కు గతంలో శంకుస్థాపన మాత్రమే చేస్తే తాము ఈ రెండేళ్లలో పూర్తిచేశామని, త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. మరో 4ఫ్లైఓవర్లకు డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నామన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఎనిమిదిలైన్ల రహదారి, మెట్రోరైల్.. శంకుస్థాపనలకు సిద్ధమయ్యాయని వివరించారు. బెంగళూరు, చెన్నై, ముంబై తరహాలో విశాఖను అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. బీజేపీ నాయకులకు నిజంగా విశాఖపై ప్రేమ ఉంటే రైల్వేజోన్, ప్రత్యేక హోదా, మెట్రోరైల్ వచ్చే విధంగా చూడాలని, ఈ విషయంపై అధిష్టానాన్ని ప్రశ్నించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కె.కె.రాజు, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖ అభివృద్ధి
సాక్షి, విశాఖపట్నం: కార్యనిర్వాహక రాజధాని కానున్న విశాఖ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాజెక్టులు చేపట్టిందని ఎంపీ వి.విజయసాయిరెడ్డి చెప్పారు. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ పరిధుల్లో పలు ప్రాజెక్టులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసినట్టు చెప్పారు. విశాఖలో కైలాసగిరి నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకూ ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన జరుగుతోందన్నారు. విశాఖ జిల్లాలో కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలతో పాటు జీవీఎంసీ, వీఎంఆర్డీఏ పరిధుల్లో వివిధ ప్రాజెక్టుల పురోగతిపై బుధవారం జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు సమీక్షించారు. విశాఖ కలెక్టరేట్లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు విజయసాయిరెడ్డి సమాధానమిస్తూ.. కార్యనిర్వాహక రాజధాని అతి త్వరలోనే విశాఖకు వస్తుందని సమాధానమిచ్చారు. సీఆర్డీఏకు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని, ఆ కేసులకు రాజధాని తరలింపునకు సంబంధం లేదన్నారు. -
విశాఖ అభివృద్ధిపై కలెక్టర్ నివేదిక
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరం అభివృద్ధి పనులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ సోమవారం నివేదిక సమర్పించారు. నగర శివారు ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం రూ.240 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. ఇంటింటికి కుళాయి పథకం, ఏలూరు నీరు నిల్వ చేసేందుకు రూ.500 కోట్లతో రిజర్వాయర్ల మార్పునకు ప్రతిపాదనలు చేశారు. విశాఖలో మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే కలెక్టర్‌ను వివరాలు కోరారు. కాగా, విశాఖలో సీ హారియర్ మ్యూజియం నిర్మాణానికి త్వరలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. -
విశాఖ నగరాభివృద్ధికి నవోదయం
సాక్షి, విశాఖ సిటీ: ‘వీఎంఆర్డీఎ ద్వారా ప్రజలకు మేలు కలిగే పనులు జరగాలి. సంస్థ చేపట్టే ప్రతి కార్యక్రమం పూర్తిగా ప్రజామోదంతోనే జరగాలి. ప్రతి పని అవినీతిరహితంగా ఉండాలి.. ప్రతి అడుగు పారదర్శకంగా పడాలి’... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశమిది. అందుకు తగ్గట్టే విశాఖ నగరం కేంద్రంగా నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ప్రతిష్టాత్మక సంస్థ విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సంస్థ ద్వారా ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నద్దమవుతోంది. ఇందుకు నిదర్శనంగా గత పదేళ్లుగా (వుడాగా ఉన్న సమయంతో కలిపి) ఖాళీగా ఉన్న పాలక బోర్డును ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సంస్థ చైర్మన్‌గా అనుభవజ్ఞుడు, వివాద రహితుడు.. గత ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ను ప్రభుత్వం నియమించింది. అతిత్వరలో బోర్డులో మిగిలిన పదవులు కూడా భర్తీ కానున్నాయి. చైర్మన్‌గా ద్రోణంరాజు శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ల్యాండ్ పూలింగ్తో పాతాళానికి నాలుగు దశాబ్దాల క్రితం 1978లో విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా) ప్రారంభమైంది. ఈ ప్రస్థానంలో వుడా ఆధ్వర్యంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అటు ప్రజలకు లబ్ధి చేకూరడంతో పాటు ఇటు ప్రభుత్వానికి కూడా దండిగా ఆదాయం సమకూరేది. అయితే ఈ క్రమంలో వుడా చరిత్రలో కొన్ని మచ్చలు, మరకలు కూడా తలెత్తాయి. పదేళ్లుగా ఈ సంస్థకు సరైన మార్గనిర్దేశనం లేదు. ముఖ్యంగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తరువాత ఓ దశలో సంస్థ తిరోగమనంలో పయనించింది. ఈ క్రమంలో 2014లో టీడీపీ అధికారం చేపట్టాక వుడా పూర్తిగా ఆ పార్టీ జేబు సంస్థగా మారిపోయింది. నగరంలో అనేక భూములపై కన్నేసిన టీడీపీ పెద్దలు, అనుయాయులు నిబంధనలకు విరుద్ధంగా పేదల భూములు లాక్కునే ప్రయత్నాలు ప్రారంభించారు. తాము చేస్తున్నది నిబంధనల ప్రకారమే అన్న రంగు పూసేందుకు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను తెరపైకి తెచ్చారు. అమరావతి తరహాలో ఇక్కడ వుడా(వీఎంఆర్డీఎ)ను వాడుకుని భూ సమీకరణకు పాలకులు తెగించారు. టీడీపీ ప్రభుత్వం నిర్వాకం కారణంగా సంస్థ ప్రతిష్ట మసకబారింది. మరోవైపు 2018లో వుడా పరిధిని విస్తరించిన టీడీపీ ప్రభుత్వం వీఎంఆర్‌డీఎగా మార్పుచేసింది. కానీ చైర్మన్ పదవిని నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వద్దే ఉంచుకుని తమ అనుచరులతో సంస్థను నడిపించారు. సంస్థ పరిధిని పెంచారే తప్ప ప్రతిష్టను పెంచే కార్యక్రమం ఒక్కటీ చేయలేదు. పరిధి విస్తృతం.. పనులు ప్రత్యేకం ► విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఎ) విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాళుళం, తూర్పుగోదావరి (ఉత్తరకోస్తా) జిల్లాల్లో విస్తరించి ఉంది. వుడాగా ఉన్న సంస్థ ఆయా జిల్లాలను కలుపుకుని 2018 సెప్టంబర్ 5న వీఎంఆర్‌డీఎగా రూపాంతరం చెందింది. సంస్థ డెవలప్మెంట్ పరిధి మొత్తం 4,873 కిలోమీటర్లు. ► వీఎంఆర్డీఎ కమిషనర్‌కు రూ.కోటి విలువైన పనులకు మాత్రమే అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రూ.కోటి నుంచి 10 కోట్ల వరకు అభివృద్ధి పనులకు అనుమతి ఇచ్చే వెసులుబాటు ఉంది. అదే బోర్డు నియామకం జరిగితే రూ.100 కోట్ల పనులకు అనుమతి ఇచ్చే అధికారం ఉంటుంది. రూ.100 కోట్లకు పైగా అనుమతిని రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాల్సి ఉంటుంది. ► ప్రస్తుతం సంస్థ ఇన్చార్జి కమిషనర్‌గా జీవీఎంసీ కమిషనర్ జి.సృజన ఉన్నారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం సంస్థ తొలి చైర్మన్‌గా చైర్మన్‌గా ద్రోణంరాజు శ్రీనివాస్‌ను నియమించింది. వుడా తొలి చైర్మన్‌గా శ్రీనివాస్ తండ్రి ద్రోణంరాజు సత్యనారాయణ సరిగ్గా 40 ఏళ్ల క్రితం బాధ్యతలు స్వీకరించడం విశేషం. పారదర్శకతే ప్రామాణికం ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక వీఎంఆర్డీఎపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సంస్థను ప్రక్షాళన చేసే దిశగా పదేళ్లుగా ఖాళీగా ఉన్న చైర్మన్ పదవిని కేవలం 40 రోజుల్లో భర్తీ చేశారు. చైర్మన్‌గా నియమితులైన ద్రోణంరాజు శ్రీనివాస్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్న సమయంలో పారదర్శకతే ప్రామాణికంగా సంస్థను నడపాలని దిశానిర్దేశం చేశారు. ప్రజా శ్రేయస్సే ప్రథమ కర్తవ్యంగా ముందుగా సాగాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆలోచన ప్రకా రం భవిష్యత్తులో వీఎంఆర్డీఎ సంస్థ అత్యున్నతస్థితికి చేరుకుంటుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేడుచైర్మన్ బాధ్యతల స్వీకరణ విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్‌గా నియమితులైన ద్రోణంరాజు శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం పదకొండున్నరకు సిరిపురంలోని వుడా చిల్డ్రన్ థియేటర్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం నగరంలోని వీఎంఆర్డీఎ భవనంలోని 3వ అంతస్తులోని చైర్మన్ చాంబర్లో ద్రోణంరాజు బాధ్యతలు స్వీకరిస్తారని సంస్థ ఇన్చార్జి కమిషనర్ జి.సృజన తెలిపారు. అనంతరం నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకుంటారని పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌యాదవ్ ఓ ప్రకటనతో తెలిపారు. భారీగా తరలిరండి.. వైఎస్సార్సీపీ శ్రేణులకు పార్టీ నగరాధ్యక్షుడు వంశీకృష్ణ పిలుపు సాక్షి, విశాఖపట్నం: విఎంఆర్డీఏ చైర్మన్‌గా ద్రోణంరాజు శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా నగరవ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులు కార్యక్రమానికి హాజరు కావాలని ఆపార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం మద్దిలపాలెం పార్టీ నగర కార్యాలయంలో ద్రోణంరాజు శ్రీనివాస్‌తో సహా మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. శుక్రవారం మధ్యహ్నం 12 గంటలకు సిరపురంలో గల వీఎంఆర్డీకు చెందిన వుడా చిల్డ్రన్ ఎరీనాలో బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. 1.10 గంటలకు వీఎంఆర్డీఏ కార్యలయానికి వెళ్తారని, అనంతరం నగర పార్టీ కార్యలయానికి చేరుకుని పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, సమన్వయకర్తలు కె.కె రాజు, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ బెహారా భాస్కర్, రాష్ట్ర అధికార ప్రతినిధి జాన్‌వెస్లీ, అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, నడింపల్లి కృష్ణంరాజు, మొల్లి అప్పారావు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వామనరావు, వుడా మాజీ చైర్మన్ పీఎస్ఎన్ రాజు, నగర అనుబంధ సంఘాల అధ్యక్షులు కాళిదాస్‌రెడ్డి, రాధా తదితరులు పాల్గొన్నారు. -
సెజ్‌లో గ‘లీజ్’
అదే ‘సాఫ్ట్’ మోసానికి అవకాశం మంత్రి గంటా అండ ఉందని ప్రచారం ఆర్భాటం చూసి నమ్మేసిన నిరుద్యోగలు రూ.12 కోట్లు దండేసి బిచాణా ఎత్తేసిన ‘ఎక్సాల్ట్’ ఎన్నాళ్లీ ఐటీ సంస్థల వసూళ్ల మేత ఊరూ పేరూ లేని ఓ కంపెనీ.. సాఫ్ట్‌వేర్‌కున్న డిమాండ్‌ను సొమ్ము చేసుకొని కోట్లు కొల్లగొట్టేందుకు భారీ స్కెచ్ వేసింది. ఐటీ సెజ్‌లో పక్కా భవనం కలిగిన మరో సాఫ్ట్వేర్ సంస్థ నుంచి కార్యాలయ భవనాన్ని లీజుకు తీసుకొని పాగా వేసింది. ఏకంగా రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావును తీసుకొచ్చి ప్రారంభోత్సవం పేరుతో అట్టహాసం చేసింది. ఐటీ సెజ్‌లో ఆఫీసు.. మంత్రితో ప్రారంభం.. ఇంకేం.. యువత నమ్మేశారు. ఉద్యోగాల కోసం ఎగబడ్డారు. ఇదే అదనుగా కౌంటర్ తెరిచేశారు. రూ.కోట్లు దండేశారు. ఆర్నెలల్లోనే దుకాణం చక్కబెట్టి బిచాణా ఎత్తేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఐటీ సెజ్‌లో ఓ కంపెనీ ఆఫీసు తీసుకుని హడావుడి చేస్తుంటే ఇన్నాళ్లూ అధికారులు ఏం చేస్తున్నట్టు?.. అలాంటి కంపెనీల ప్రారంభానికి బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న గంటా ఎలా వెళ్లారన్నదే ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది. విశాఖపట్నం : నవ్యాంధ్రప్రదేశ్‌లో ఐటీ రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తామన్న పాలకుల ఆర్భాటం ఎలా ఉన్నా.. దాన్నే అవకాశంగా తీసుకొని కొన్ని సంస్థలు ‘సాఫ్ట్’గా మోసాలకు పాల్పడుతూ విశాఖ యువతను రోడ్డున పడేస్తున్నాయి. విశాఖ ఐటీ సెజ్‌లో ఎన్నో ఏళ్ల కిందట భూములు తీసుకున్న 12 సాఫ్ట్వేర్ సంస్థల్లో నాలుగు కంపెనీలు ఇప్పటికీ కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఇక భవనాలు నిర్మించిన కొన్ని కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి ప్రామాణికాలు లేని నకిలీ ఐటీ సంస్థలకు ఆ భవనాలను అద్దెకిచ్చి వాటి మోసాలకు పరోక్షంగా తోడ్పడుతున్నాయి. ఇటీవల నిరుద్యోగుల నుంచి రూ.12 కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేసిన ఎక్సాల్ట్ సంస్థ నిర్వాకం వెనుక సర్కారు తప్పిదమూ కనిపిస్తోంది. రుషికొండలోని ఐటీ సెజ్ హిల్ నెం-2లో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌సోల్ కంపెనీకి 2007లో ప్రభుత్వం ఎకరా స్థలం కేటాయించింది. నిబంధనల మేరకు ఆ సంస్థ అందులో కార్యకలాపాలు ప్రారంభించి వందమందికి ఉద్యోగాలు కల్పించాలి. కానీ ఆ స్థలంలో భవన నిర్మాణం పూర్తి చేసిన సాఫ్ట్‌సోల్ సంస్థ ఇప్పటివరకు ఎటువంటి ఐటీ కార్యకలాపాలు ప్రారంభించలేదు. పైగా నిబంధనలకు విరుద్ధంగా ఎక్సాల్ట్ ఇండియా లిమిటెడ్ అనే బోగస్ సంస్థకు ఇటీవల తన భవనాన్ని లీజు ప్రాతిపదికన అద్దెకు ఇచ్చింది. మంత్రి అండ ఉందని ప్రచారం అద్దెకు తీసుకున్న సదరు సంస్థ తమకు ప్రభుత్వ పెద్దల అండ ఉందని ప్రచారం చేసుకుంది. దానికి బలం చేకూర్చేలా గత జనవరిలో జరిగిన ప్రారంభోత్సవానికి మంత్రి గంటా శ్రీనివాసరావుతో సహా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖులందరినీ ఆహ్వానించింది. స్వయంగా మానవ వనరుల శాఖ మంత్రి గంటా వెళ్లి ప్రారంభించడంతో విశాఖ యువతలో.. అది మంచి కంపెనీనే.. అన్న భావన ఏర్పడింది. దీంతో వందలాదిమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎగబడ్డారు. ఇదే అదనుగా కంపెనీ నిర్వాహకులు దాదాపు రూ.12 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. సరిగ్గా రెండు నెలల కూడా జీతాలు చెల్లించని సంస్థ ప్రతినిధులు వారం కిందట పత్తా లేకుండా పోయారు. హైదరాబాద్‌లో ఉన్న శాఖ కార్యాలయాన్ని కూడా ఎత్తేశారు. మోసపోయామని భావించిన బాధితులు పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదేనా ఐటీ ప్రగతి వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గత రెండేళ్లలో విశాఖలో మూడు సాఫ్ట్వేర్ సంస్థలు ఉద్యోగులను నట్టేట ముంచాయి. డాబాగార్డెన్స్‌లో గత ఏడాది రెండు కంపెనీలు రూ.3 కోట్లు పోగేసుకుని బోర్డు తిప్పేయగా.. తాజాగా ఎక్సాల్ట్ కంపెనీ ఏకంగా రూ.12 కోట్లకు ముంచేసింది. విశాఖలో ఉద్యోగాల కోసం రూ.2 కోట్లు వసూలు చేసిన ఎక్సాల్ట్ ప్రతినిధులు.. మలేసియాలో ఉద్యోగం ఇస్తామన్న ఆశ చూపి మరో పదికోట్లు వసూలు చేశారని అంటున్నారు. ఐటీ సెజ్‌లో భూములు తీసుకున్న చాలా సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించకపోగా, ఎట్టకేలకు తెరుస్తున్న కంపెనీలు ఇలా నిరుద్యోగులను నట్టేట ముంచుతున్నాయి. కాగా, మురళీనగర్‌లో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితిలో మూసివేత దిశగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఎక్సాల్ట్ ఎండీ పట్టివేతకు ప్రత్యేక బృందాలు:సీఐ పరారీలో ఉన్న ఎక్సాల్ట్ సంస్థ ఎండీ కిరణ్‌కుమార్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని భీమిలి సీఐ టి.అప్పలనాయుడు తెలిపారు. రూ.2 కోట్ల మేర నష్టపోయామని బాధితులు ఫిర్యాదు చేశారని చెప్పారు. హైదరాబాద్‌లోని కంపెనీని కూడా ఎత్తివేశారని, ప్రధాన నిందితుడు విదేశాలకు పారిపోకుండా త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. అలాంటి కంపెనీలను నమ్మకూడదు -జి.శ్రీధర్‌రెడ్డి, మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సీఈవో (పొటో: 23వీఎస్సీ310ఎ) మోసపూరిత సాఫ్ట్వేర్ సంస్థల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగాలు ఇస్తామంటే డబ్బులు చెల్లించడం సరైంది కాదు. ముందుగా కంపెనీ విధివిధానాలు తెలుసుకోవాలి. డబ్బులు తీసుకొని ఆరు నెలల శిక్షణ తర్వాత ఉద్యోగాలిస్తాం.. అని చెప్పే సంస్థలను నమ్మకూడదు. ఒక పేరు మీద ఉన్న సంస్థ మరో సంస్థకు లీజుకు ఇవ్వకూడదు. ఎక్సాల్ట్ వంటి కంపెనీలపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. మంత్రికి బాధ్యత లేదా? -జాన్ వెస్లీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి (పొటో: 23వీఎస్సీ310 మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారంటే ఆ కంపెనీ నిబంధనల మేరకు పక్కాగా ఉంటుందని ప్రజలు నమ్ముతారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు అలాంటి కంపెనీల గురించి ముందుగా తెలుసుకోవాలి. అన్నీ నిబంధనల మేరకు ఉన్నాయంటేనే ప్రారంభించాలి. లేదంటే ఎక్సాల్ట్ కంపెనీల వంటి అనుభవాలే ఎదురవుతాయి. ఇప్పటికైనా మంత్రి గంటా స్పందించి ఎక్సాల్ట్ ప్రతినిధులను పట్టుకునేలా పోలీసులకు ఆదేశాలివ్వాలి. నష్టపోయిన వారికి పరిహారం వచ్చేలా బాధ్యత తీసుకోవాలి. -
ఏం చేద్దాం.. ఎలా చేద్దాం
- జిల్లా అభివృద్ధిపై తొలి సమీక్ష - ప్రభుత్వ పథకాలు, సమస్యలపై విసృ్తత స్థాయిలో చర్చ - ఇక ప్రతి నెలా సమీక్ష సమావేశాలు - ఎమ్మెల్యేలకు చెప్పిచేయమని అధికారులకు మంత్రి గంటా ఆదేశం - ఈ నెల 28న అరకులో సంక్షేమ శిబిరానికి సీఎంకు ఆహ్వానం -13న విశాఖ, 14న అనకాపల్లిలో వికలాంగుల శిబిరాలకు కేంద్ర మంత్రి రాక విశాఖపట్నం : ప్రభుత్వం కొలువైన పది నెలలకు తొలిసారిగా విశాఖపట్నం జిల్లా అభివృద్ధికి ఏం చేయాలనే దానిపై ప్రజాప్రతినిధులు సమీక్ష జరిపారు. రాష్ట్ర మానవ వనరులు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎంపీలు కె.హరిబాబు, ముత్తంశెట్టి శ్రీనివాస్, 12 మంది ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వ పథకాల అమలులో లోటుపాట్లపై అధికారులను నిలదీశారు. హుద్‌హుద్ తుపాను సాయం, పింఛన్లు, విద్య, వైద్య, వ్యవసాయ శాఖలపై సమీక్ష జరిపారు. అధికారుల వైఫల్యాలను తీవ్రంగా తప్పుబట్టారు. పథకాల లోటుపాట్లను సరిదిద్దుకుని వాటిని అర్హులైన వారికి అందించడం, పథకాల అమలులో అధికారులు, ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం సాధించడం కోసం ఇక ప్రతినెల చివరి శుక్రవారం ఇటువంటి సమీక్షలు జరపనున్నట్లు మంత్రి గంటా ఈ సందర్భంగా ప్రకటించారు. సంక్షేమ పథకాలన్నింటినీ లబ్ధిదారులకు ఒకేచోట అందించేలా ఈ నెల 28న అరకులో భారీ సంక్షేమ శిబిరాన్ని నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13న విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, 14న అనకాపల్లి ఎన్టిఆర్ స్టేడింయంలో వికలాంగుల కోసం ప్రత్యేక సంక్షేమ శిబిరాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎన్.యువరాజ్ వెల్లడించారు. ఈ శిబిరాలకు కేంద్ర మంత్రి అశోక్ గెహ్లట్ హాజరవుతారన్నారు. నియోజకవర్గాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదనలు రూపొందించేటప్పుడు సంబంధిత ఎమ్మెల్యేలకు తెలియజేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించాల్సిందిగా అధికారులకు గంటా ఆదేశాలిచ్చారు. శాసనసభ్యులు తమ నియోజకవర్గ సమస్యలను చెప్పినపుడు తక్షణమే స్పందించాలన్నారు. బ్యాంకుల ద్వారా పింఛన్ల పంపిణీ చేయాలని ఎంపీ హరిబాబు సూచించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ త్వరలో ప్రభుత్వం మల్టీ ఛానల్ డెలివరీ సిస్టంను ప్రవేశపెట్టనుందని, జిల్లాలో ఓ మండలంలో వచ్చే నెల నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని తెలిపారు. దీని వల్ల పింఛన్ దారులు తాము ఏ విధంగా పింఛన్ పొందాలనుకుంటున్నారనే ఆప్షన్ ఆ విధంగానే చెల్లించే ఏర్పాటు చేస్తామన్నారు. బ్యాంకు, పోస్టాఫీసు, రేషన్ షాపులో పింఛన్లు చెల్లించేలా ప్రభుత్వం ఆలోచిస్తోందని వివరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో విద్యార్ధులను చేర్చుకునే కార్యక్రమం చేపట్టాలని ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇంటర్మీడియెట్ అధికారులకు సూచించారు. ఏజెన్సీలో హుద్‌హుద్ తుపానుకు దెబ్బతిన్న పాఠశాలల మరమ్మతులకు ఇంకా నిధులు విడుదల కాలేదని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు అన్నారు.యుపి స్కూల్లో తాగునీరు, మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందన్నారు.జిల్లాలో 156 పాఠశాలల మరమ్మతులకు రూ.8.52కోట్లు మంజూరైనట్లు సర్వశిక్ష అభియాన్ పీఓ నగేష్ తెలిపారు. ఈ సమస్యపై నెలవారీ నివేదిక ఇవ్వాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు.తగిన ప్రతిపాదనలు ఇస్తే ఎంపీ లాడ్స్ నుంచి నిధులు ఇస్తానని ఎంపీ హరిబాబు చెప్పారు. కాఫీ తోటలు, ఇతర ఉద్యానపంటల పరిహారం చెల్లింపులో అధికారులు తమ ఇష్టానుసారం వ్యవహరించారని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉందని, విద్య, వైద్య శాఖలతో ఇబ్బందులు ఉన్నాయని పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత అన్నారు. మధ్యాహ్న భోజన పధకం బిల్లుల బకాయిలు చెల్లించాలని ఎమ్మెల్యే గణబాబు ప్రస్తావించారు.నిధులు విడుదలయ్యాయని నాలుగైదు రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖాధికారి కృష్ణారెడ్డి బదులిచ్చారు. సర్వశిక్ష అభియాన్ ద్వారా పాఠశాల భవనాల నిర్మాణంలో సమస్యలు ఎదురవుతున్నట్లు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. ఉద్యోగ విరమణ పొందిన వారిని బోధకులుగా నియమించే పద్ధతికి స్వస్తి పలకాలని ఆయన సూచించారు. కోళ్ల పరిశ్రమకు సంబంధించి అర్హులకు ఇంత వరకూ తుపాను సాయం అందలేదని, అనర్హుల పేర్లు లబ్దిదారుల జాబితాలో చేర్చారని అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ అన్నారు. వైద్యులు అందుబాటులో ఉండటం లేదన్నారు. బోట్లకు కూడా నష్టపరిహారం అందాల్సిందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ చెప్పారు. గ్యాస్ సిలిండర్ పేలుడు దర్ఘటన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు తమ నియోజకవర్గ సమస్యలను వివరించారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలం భవానీ, అధికారులు పాల్గొన్నారు.