ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల5న విశాఖపట్నంలో జాతీయ విద్యా సదస్సును నిర్వహిస్తున్నట్లు ఏపీటీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపారు.
సాక్షి,హైదరాబాద్: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల5న విశాఖపట్నంలో జాతీయ విద్యా సదస్సును నిర్వహిస్తున్నట్లు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జీ. హృదయరాజు, ఐఫియా జాతీయ ఉపాధ్యక్షులు కె. సుబ్బారెడ్డిలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అఖిల భారత విద్యా సంఘాల సమాఖ్య(ఏఐఎఫ్‌ఈఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో ఉపాధ్యాయుని విలువలు - వృత్తి ఔన్నత్వాన్ని పెంపొందించుట అంశంపై జాతీయ నాయకులు ప్రసంగాలు ఉంటాయని చెప్పారు. 11 రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరౌతున్న ఈ సదస్సులో ఉపాధ్యాయులు, విద్యాభిమానులు, ప్రజాతంత్రవాదులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.