
సాక్షి, అమరావతి : పంచగ్రామాల సమస్య పరిష్కారం కనుగొనే విషయమై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ కలెక్టర్ వినయ్‌ను ఆదేశించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో రిసెప్షనిస్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వచ్చామా? అని ప్రజలు బాధపడకూడదు. వాళ్లు సమస్యలు, బాధతో వస్తారన్న విషయాన్ని గుర్తించి.. వారి ఫిర్యాదులను ఎలా స్వీకరిస్తున్నాం, ఎలా పరిష్కరిస్తున్నామన్నది ముఖ్యం. పోలీసులు చిరు నవ్వుతో ప్రజలను స్వాగతించాలి. నేను ఇదివరకే ఈ విషయం మీకు చెప్పాను. ఇది కొనసాగాలి. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఈ సందేశం పంపాలి’ అని సీఎం జగన్ కలెక్టర్‌ను ఆదేశించారు.
వారి సమస్యలు పరిష్కరించండి
వైఎస్సార్ జిల్లా : పులివెందుల నియోజకవర్గ పరిధిలోని యుసిఐఎల్ బాధితుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ హరికిరణ్, యుసిఐఎల్, సిఎండి అధికారులు, బాధితులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. యుసిఐఎల్ బాధితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులు, ఎంపీ, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. పరిశ్రమలో గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేసి, బాధితులకు తాగునీరు, టైల్‌పాండ్ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment