ENG vs IND: వైజాగ్‌ టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం | IND vs ENG 2nd Test: Day 4 Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

ENG vs IND: వైజాగ్‌ టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం

Published Mon, Feb 5 2024 9:30 AM | Last Updated on Mon, Feb 5 2024 2:24 PM

ENG vs IND 2nd Test: Day4 Live updates and Highlights - Sakshi

India vs England, 2nd Test At Vizag Day 4 Updates: 

వైజాగ్‌ టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం
విశాఖ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమానంగా నిలిచింది. టామ్‌ హార్ట్లీని (36) బుమ్రా క్లీన్‌ బౌల్డ్‌ చేయడం ద్వారా టీమిండియా గెలుపు ఖరారైంది.

ఈ మ్యాచ్‌లో బుమ్రా తొమ్మిది వికెట్లు (6/45, 3/46) తీసి టీమిండియా గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ డబుల్‌ సెంచరీతో (209), సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (104) సెంచరీతో సత్తా చాటారు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు సమిష్టిగా రాణించి అపురూప విజయాన్ని అందించారు.  

స్కోర్‌ వివరాలు..
భారత్‌: 396 & 255
ఇంగ్లండ్‌: 253 & 292

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
281 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. ముకేశ్‌ కుమార్‌ బౌలింగ్‌లో  శ్రీకర్‌ భరత్‌కు క్యాచ్‌ ఇచ్చి షోయబ్‌ బషీర్‌ (0) ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలుపు ఖరారైపోయింది. ఇంగ్లండ్‌ లక్ష్యానికి ఇంకా 118 పరుగుల దూరంలో ఉంది.

ఎనిమిదో వికెట్‌ డౌన్‌..
275 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. 36 పరుగుల చేసిన బెన్‌ ఫోక్స్‌.. బుమ్రా బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. భారత్‌ విజయానికి ఇంకా రెండు వికెట్లు కావాలి.

నిలకడగా ఆడుతున్న బెన్‌ ఫోక్స్‌.. ఇంగ్లండ్‌ స్కోరు: 261-7(62 ఓవర్లలో)
టీమిండియా గెలుపునకు మూడు వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్‌ గెలవాలంటే 134 పరుగులు కావాలి.

గెలుపు దిశగా టీమిండియా.. ఏడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
52.4: ఏడో వికెట్‌గా వెనుదిరిగిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌(11).  అశ్విన్‌ బౌలింగ్‌లో ఫోక్స్‌ సింగిల్‌కు యత్నించగా.. స్టోక్స్‌ బద్దకంగా పరుగుకు వచ్చాడు. ఈ క్రమంలో బంతిని అందుకున్న శ్రేయస్‌ అయ్యర్‌ డైరెక్ట్‌ త్రోతో స్టోక్స్‌ను రనౌట్‌ చేశాడు. టామ్‌ హార్లీ క్రీజులోకి వచ్చాడు. స్కోరు:  220-7(53). టీమిండియా విజయానికి ఇంకా మూడు వికెట్ల దూరంలో ఉంది.

49 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 210/6
49 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ విజయానికి ఇంకా 189 పరుగుల దూరంలో ఉంది. 

లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఇంగ్లండ్‌ స్కోరు: 194/6 (42.4)
టీమిండియా విధించిన 399 పరుగుల లక్ష్యానికి.. ఇంగ్లండ్‌ ఇంకా 205 పరుగుల దూరంలో ఉంది. ఇక రోహిత్‌ సేన మరో నాలుగు వికెట్లు తీస్తే గెలుపు భారత్‌ సొంతమవుతుంది.

రసవత్తరంగా మ్యాచ్‌.. ఆరో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
42.4: జానీ బెయిర్‌ స్టో రూపంలో ఇంగ్లండ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో బెయిర్‌ స్టో(26) లెగ్‌ బిఫోర్‌ వికెట్‌(ఎల్బీడబ్ల్యూ)గా వెనుదిరిగాడు. బెన్‌ స్టోక్స్‌ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నాడు.

ఇంగ్లండ్‌ ఐదో వికెట్‌ డౌన్‌.. క్రాలీ ఔట్‌
ఇంగ్లండ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 73 పరుగులు చేసిన జాక్‌ క్రాలే.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. ఇంగ్లండ్‌ విజయానికి ఇంకా 205 పరుగులు కావాలి

►42 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 194/4.  ఇంగ్లండ్‌ విజయానికి ఇంకా 205 పరుగులు కావాలి
ఇంగ్లండ్‌ మూడో వికెట్‌ డౌన్‌.. రూట్‌ అవుట్‌
154 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 16 పరుగులు చేసిన జో రూట్‌.. అశ్విన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి జానీ బెయిర్‌ స్టో వచ్చాడు.

రోహిత్‌ సూపర్‌ క్యాచ్‌..
ఓలీ పోప్‌ రూపంలో ఇంగ్లండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 23 పరుగులు చేసిన పోప్‌.. అశ్విన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రోహిత్‌ శర్మ అద్బుత క్యాచ్‌తో పోప్‌ను పెవిలియన్‌కు పంపాడు. క్రీజులో జాక్‌ క్రాలే(53), జో రూట్‌(4) ఉన్నారు. 29 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 143/3

జాక్‌ క్రాలీ ఫిప్టీ..
సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జాక్‌ క్రాలే హాఫ్‌ సెంచరీ సాధించాడు. క్రాలీ ప్రస్తుతం 51 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఇంగ్లండ్‌ విజయానికి ఇంకా 274 పరుగులు కావాలి. 27 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 125/2

21.5: రెండో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో రెహాన్‌ అహ్మద్‌(23) లెగ్‌ బిఫోర్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. క్రాలే 39 పరుగులతో ఆడుతున్నాడు. ఒలీ పోప్‌ క్రీజులోకి వచ్చాడు. వచ్చీ రాగానే ఫోర్‌ బాదాడు. ఇంగ్లండ్‌ స్కోరు:  99-2(22)

నిలకడగా ఆడుతున్న క్రాలే, రెహాన్‌ అహ్మద్‌
19 ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు:  82-1

9 వికెట్ల దూరంలో టీమిండియా
విశాఖపట్నం వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య రెండో టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఇంగ్లండ్‌ విజయానికి 332 పరుగులు అవసరమవ్వగా.. భారత్‌ గెలుపొందాలంటే ఇంకా 9 వికెట్లు పడగొట్టాలి. 399 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. మూడో రోజు ఆట ముగిసే సరికి 14 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 67 పరుగులు చేసింది. 

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌
►టాస్‌: టీమిండియా... బ్యాటింగ్‌
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు: 396-10 (112 ఓవర్లలో)

ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌ స్కోరు: 253-10 (55.5 ఓవర్లలో)
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు: 255-10 (78.3 ఓవర్లలో)
ఇంగ్లండ్‌ విజయ లక్ష్యం: 399 రన్స్‌.

తుది జట్లు:
భారత్: 
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్‌కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముకేష్ కుమార్, కుల్దీప్ యాదవ్.

ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్‌), బెన్ ఫోక్స్(వికెట్‌ కీపర్‌), రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement