ఐపీఎల్-2025 సీజన్‌కు ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న మెగా వేలంలో తన పేరును నమోదు చేయకూడదని స్టోక్స్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది బిజీ టెస్టు షెడ్యూల్ కారణంగా స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెలిగ్రాఫ్ తమ కథనంలో పేర్కొంది.
టెలిగ్రాఫ్ రిపోర్ట్ ప్రకారం.. వచ్చే ఏడాది క్యాష్‌రిచ్ లీగ్ సీజన్ వేలానికి స్టోక్స్‌తో పాటు మరికొంతమంది ఇంగ్లీష్ ఆటగాళ్లు సైతం దూరంగా ఉండనున్నట్లు సమాచారం. కాగా స్టోక్సీ చివరగా ఐపీఎల్-2023 సీజన్‌లో ఆడాడు. సీఎస్‌కే అతడిని రూ.16.25 కోట్ల భారీ ధర వెచ్చించి మరి కొనుగోలు చేసింది.
కానీ తన ధరకు తగ్గ న్యాయం స్టోక్స్ చేయలేకపోయాడు. కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన స్టోక్స్ గాయం కారణంగా మిగిలిన సీజన్ మొత్తానికి బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు స్టోక్సీను చెన్నై ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. ఐపీఎల్-2024 వేలంలోనూ ఈ ఇంగ్లీష్ క్రికెటర్ వ్యక్తిగత కారణాలతో పాల్గోలేదు. ఇప్పుడు ఐపీఎల్-2025 మెగా వేలం కూడా దూరం కానున్నాడు.
రేపే లాస్ట్..
ఇక ఐపీఎల్-2025 మెగా వేలంలో ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు గడువు ఆదివారం(నవంబర్ 3)తో ముగియనుంది. అయితే వచ్చే ఏడాది సీజన్ వేలానికి ముందు బీసీసీఐ రూల్స్‌ను మరింత కఠినం చేసిన సంగతి తెలిసిందే.
ఒక్కసారి వేలంలో ఏదైనా జట్టు ఆటగాడిని తీసుకుంటే కనీసం మూడేళ్లపాటు ఉండాల్సిందేనని షరతు విధించింది. దీంతో చాలా మంది ఆటగాళ్లు విదేశీ ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోవాల వద్ద అన్న సందిగ్ధంలో పడ్డారు. కాగా మెగా వేలం నవంబర్ ఆఖరిలో సౌథీ అరేబియా వేదికగా జరిగే ఛాన్స్ ఉంది.
చదవండి: IND vs UAE: టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క పరుగు తేడాతో ఓటమి
Comments
Please login to add a commentAdd a comment