పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ సన్నద్దమవుతోంది. ఇప్పటికే పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లీష్ జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఆక్టోబర్ 7 నుంచి ముల్తాన్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఫస్ట్ టెస్టుకు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఇంగ్లండ్ క్రికెట్ ప్రకటించింది.
ముల్తాన్ టెస్టుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా దూరమయ్యాడు. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న స్టోక్స్.. పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరికొంత సమయం పట్టనుంది. దీంతో తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఓలీ పోప్ వ్యవహరించనున్నాడు. అదేవిధంగా ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్సే ఇంగ్లండ్ తరపున టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టనున్నాడు.
మరోవైపు ఈ సిరీస్‌తో స్టార్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చాడు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత అతడు ఇంగ్లండ్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. శ్రీలంకపై బ్యాట్, బాల్‌తో సత్తాచాటిన గుస్ అట్కిన్సన్‌కు కూడా ఇంగ్లండ్ మెనెజ్‌మెంట్ తొలి టెస్టుకు చోటు కల్పించింది.
పాక్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే..
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జామీ స్మిత్, క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్సే , జాక్ లీచ్, షోయబ్ బషీర్
చదవండి: అశ్విన్ వారసుడు దొరికినట్లేనా?
Comments
Please login to add a commentAdd a comment