ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టెస్ట్ క్రికెట్‌పై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా సేవలందించడం కోసం వరల్డ్‌కప్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. టెస్ట్ క్రికెట్‌కే తన మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశాడు.
కాగా, ఇంగ్లండ్ ఈ ఏడాది మొత్తం 12 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్ టెస్ట్‌ల షెడ్యూల్ బిజీగా ఉండటంతో పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా సేవలందించడం కోసం స్టోక్స్ ఐపీఎల్, టీ20 వరల్డ్‌కప్ నుంచి తప్పుకున్నాడు. జులైలో వెస్టిండీస్‌తో సిరీస్ నుంచి ఇంగ్లండ్ టెస్ట్ ప్రయాణం మొదలవుతుంది. అనంతరం ఈ జట్టు స్వదేశంలో భారత్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది.
దీని తర్వాత ఆసీస్‌లో యాషెస్ సిరీస్.. ఇలా ఈ వార్షిక సంవత్సరంలో ఇంగ్లండ్ 12 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఇటీవల భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మోకాలి శస్త్ర చికిత్స కారణంగా స్టోక్స్ బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. భారత్‌తో తాజాగా జరిగిన సిరీస్‌లో స్టోక్స్ చాలాకాలం తర్వాత బంతి పట్టాడు.
ఇదిలా ఉంటే యుఎస్‌ఏ, వెస్టిండీస్ వేదికలుగా జరిగే టీ20 వరల్డ్‌కప్ జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇంగ్లండ్ జూన్ 4న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. బార్బడోస్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను స్కాట్లాండ్ ఢీకొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment