Ind Vs Eng 1st Test Day 4 Live Updates:
తొలి టెస్టులో టీమిండియా ఓటమి..
హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో బారత్ ఓటమి పాలైంది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 202 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ టామ్ హార్ట్‌లీ 7 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు జో రూట్, జాక్ లీచ్ తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(39) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఓటమి అంచుల్లో టీమిండియా.. అశ్విన్ ఔట్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓటమి అంచుల్లో నిలిచింది. రవి చంద్రన్ అశ్విన్(28) రూపంలో టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. భారత విజయానికి ఇంకా 49 పరుగులు కావాలి.
ఎనిమిదో వికెట్ డౌన్..
176 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన శ్రీకర్ భరత్‌ను.. హార్ట్‌లీ క్లీన్ బౌల్డ్ చేశాడు. భారత్ విజయానికి ఇంకా 54 పరుగులు కావాలి. క్రీజులో అశ్విన్, శ్రీకర్ భరత్ ఉన్నారు.
నిలకడగా ఆడుతున్న అశ్విన్, శ్రీకర్..
119 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను రవిచంద్రన్ అశ్విన్(13), శ్రీకర్ భరత్(9) అదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 53 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 89 పరుగులు కావాలి.
ఓటమి దిశగా భారత్..
ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తోంది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 119 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. శ్రేయస్ అయ్యర్ రూపంలో ఏడో వికెట్ కోల్పోయింది. భారత విజయానికి ఇంకా 111 పరుగులు కావాలి. క్రీజులో ప్రస్తుతం రవిచంద్రన్ అశ్విన్, శ్రీకర్ భరత్ ఉన్నారు.
పీకల్లోతు కష్టాల్లో టీమిండియా..
230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తడబడుతోంది. 119 పరుగుల వద్ద జడేజా రూపంలో భారత్ 6 వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన జడేజా రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. భారత విజయానికి ఇంకా 112 పరుగులు కావాలి. క్రీజులో ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్ ఉన్నారు.
ఐదో వికెట్ డౌన్.... కేఎల్ రాహుల్ ఔట్
నాలుగో ఇన్నింగ్స్‌లో 108 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. కేఎల్ రాహుల్ టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది.
నాలుగో వికెట్ డౌన్.. అక్షర్ పటేల్ ఔట్
95 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. భారత విజయానికి ఇంకా 136 పరుగులు కావాలి
టీ విరామానికి భారత్ స్కోర్: 95/3
నాలుగో రోజు టీ విరామానికి భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్(17), కేఎల్ రాహుల్(21) పరుగులతో ఉన్నారు. టీమిండియా విజయానికి 136 పరుగులు కావాలి.
రోహిత్ శర్మ (39) ఔట్.. కష్టాల్లో భారత్
కెప్టెన్ రోహిత్ శర్మ 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్ ఎల్బీడబ్యూగా వెనుదిరిగాడు. 230 పరుగుల లక్ష్య ఛేదనలో 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. కేఎల్ రాహుల్‌కు జతగా అక్షర్ పటేల్ క్రీజ్‌లోకి వచ్చాడు.
ఒకే స్కోర్ వద్ద రెండు వికెట్లు కోల్పోయిన భారత్
230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 42 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్ట్లీ ఒక్కసారిగా రెచ్చిపోయి యశస్వి జైస్వాల్ (15), శుభ్‌మన్ గిల్‌ను (0) ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు పంపాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ క్రీజ్‌లో ఉన్నారు.
తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న పోప్.. ఇంగ్లండ్ 420 ఆలౌట్
ఇంగ్లండ్ ఆటగాడు ఓలీ పోప్ తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 196 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పోప్ బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పోప్ ఔట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు 420 పరుగుల వద్ద తెర పడింది. ఆ జట్టు భారత్ ముందు 230 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
420 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో మార్క్ వుడ్ (0) ఔటయ్యాడు. పోప్ 196 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నాడు.
ఎనిమితో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
419 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అశ్విన్.. టామ్ హార్ట్లీని (34) క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
ఓవర్‌నైట్ స్కోర్ 316/6తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో వికెట్‌కీపర్ శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి రెహాన్ అహ్మద్ (28) ఔటయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోర్ 352/7గా ఉంది. 162 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఓలీ పోప్ (166), టామ్ హార్ట్లీ (3) క్రీజ్‌లో ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (70) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.భారత బౌలర్లలో అశ్విన్, జడేజా తలో 3 వికెట్లు.. అక్షర్, బుమ్రా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులు చేసి ఆలౌటైంది. జడేజా (87), కేఎల్ రాహుల్ (86), యశస్వి జైస్వాల్ (80) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో రూట్ 4, రెహాన్ అహ్మద్, హార్ట్లీ తలో 2 వికెట్లు, లీచ్ ఓ వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment