ఇంగ్లండ్‌తో జరుగబోయే రెండో టెస్ట్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. తొలి టెస్ట్ సందర్భంగా తొడ కండరాలు పట్టేయడంతో స్టార్ ఆటగాడు రవీంద్ర జడేజా రెండో మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడని తెలుస్తుంది. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో పరుగు పూర్తి చేసే క్రమంలో జడేజా తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతను రనౌట్ కావడమే కాకుండా రెండో టెస్ట్‌కు అనుమానాస్పదంగా మారాడు.
జడేజాను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి తరలించాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. జడేజా గాయం తీవ్రతపై ఇవాళ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నిన్న మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్‌లో ఈ విషయంపై ఎదురైన ప్రశ్నల గురించి స్పందించేందుకు కోచ్ రాహుల్ ద్రవిడ్ నిరాకరించాడు. విశాఖ వేదికగా రెండో టెస్ట్ ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా నిన్ననే విశాఖకు తరలివెళ్లింది.
కాగా, హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్.. టీమిండియాపై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించి కూడా ఓటమిపాలైంది. జడేజా తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో జడ్డూ బౌలింగ్‌లోనూ రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 పరుగుల వద్ద తొడ కండరాలు పట్టేయడంతో పరుగు తీసే క్రమంలో జడ్డూ రనౌటయ్యాడు. జడ్డూ రనౌట్ కావడంతో టీమిండియా ఓటమి దాదాపుగా ఖరారైపోయింది.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్ట్ స్కోర్ వివరాలు..
ఇంగ్లండ్: 246 & 420
భారత్: 436 & 202
28 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం
Comments
Please login to add a commentAdd a comment