రావల్పిండి వేదికగా అక్టోబర్ 24 నుంచి పాకిస్తాన్‌తో జరుగబోయే మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ (అక్టోబర్ 22) ప్రకటించారు. ఈ జట్టులో ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లకు చోటు దక్కింది. రావల్పిండి పిచ్ స్లో బౌలర్లకు అనుకూలించనుందన్న అంచనాతో ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. రెండో టెస్ట్ ఆడిన జట్టులో ఇద్దరు పేసర్లను ఈ మ్యాచ్ నుంచి తప్పించారు.
మాథ్యూ పాట్స్, బ్రైడన్ కార్స్ స్థానాల్లో రెహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్ తుది జట్టులోకి వచ్చారు. జాక్ లీచ్.. షోయబ్ బషీర్‌తో కలిసి మూడో స్పిన్నర్‌గా కొనసాగుతాడు. బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లండ్ ఎలాంటి మార్పులు చేయలేదు. జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్ వరుస స్థానాల్లో కొనసాగనున్నారు. ఆల్‌రౌండర్ కోటాలో బెన్ స్టోక్స్, వికెట్‌కీపర్‌గా జేమీ స్మిత్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.
పాకిస్తాన్‌తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్, రెహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, జాక్ లీచ్, షోయబ్ బషీర్
కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో పాక్ 152 పరుగుల తేడాతో గెలుపొందింది.
చదవండి: వారెవ్వా బదోని.. వాటే క్యాచ్! మైండ్ బ్లోయింగ్(వీడియో)
Comments
Please login to add a commentAdd a comment