
హైదరాబాద్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 119 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ స్పినర్లు భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. హార్ట్‌లీ 4 వికెట్లు పడగొట్టగా.. జాక్ లీచ్, రూట్ తలా వికెట్ సాధించారు. భారత విజయానికి 111 పరుగులు కావాలి. ఇంగ్లండ్ గెలుపొందాలంటే మరో 3 వికెట్లు పడగొడితే చాలు.
స్టోక్సీ బుల్లెట్ త్రో..
ఇక ఇది ఉండగా.. నాలుగో రోజు ఆట సందర్భంగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. సంచలన త్రోతో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను రనౌట్ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. భారత ఇన్నింగ్స్ 39 ఓవర్‌లో తొలి బంతిని జో రూట్ ఫుల్ టాస్‌గా సంధించాడు. అయితే జడేజా ఆ డెలివరీని మిడ్-ఆన్ వైపు ఆడాడు. దీంతో సింగిల్ కోసం నాన్‌స్ట్రైక్ వైపు పరిగెత్తాడు.
ఈ క్రమంలో వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని అందుకున్న స్టోక్సీ.. రివర్స్‌లో త్రో చేసి స్టంప్స్‌ను పడగొట్టాడు. జడ్డూ క్రీజులోకి రాకముందే బంతి స్టంప్స్‌ను గిరాటు వేయడంతో పెవిలియన్‌కు చేరక తప్పలేదు. కాగా స్టోక్స్ విన్యాసం చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా టెస్టు క్రికెట్‌లో జడేజా రనౌట్ అవ్వడం ఇదే తొలిసారి.
చదవండి: AUS vs WI: 27 ఏళ్ల తర్వాత తొలి విజయం.. కన్నీళ్లు పెట్టుకున్న బ్రియాన్ లారా! వీడియో
Bro wtf was that 🤯
— Cheems Bond (@Cheems_Bond_007) January 28, 2024
Benjamin Stokes - what a runout #INDvsENGTest #INDvsENG pic.twitter.com/l0IIEY3FY2