ఇంగ్లండ్ పురుషుల జట్టు పరిమిత ఓవర్ల హెడ్‌కోచ్‌గా న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెకల్లమ్ ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టెస్టుల్లో ఇంగ్లండ్ ప్రధాన కోచ్‌గా ఉన్న మెకల్లమ్‌కు ఆదేశ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రమోషన్ ఇచ్చింది.
ఇకపై మూడు ఫార్మాట్లలో ఇంగ్లీష్ జట్టు హెడ్‌కోచ్‌గా మెకల్లమ్ వ్యవహరించనున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌తో వైట్‌బాల్ కోచ్‌గా మెకల్లమ్ తన ప్రయణాన్ని ప్రారంభించనున్నాడు.
టీ20 వరల్డ్‌కప్‌లో వైఫల్యం తర్వాత ఇంగ్లండ్ హెడ్‌కోచ్ పదవి నుంచి మాథ్యూ మోట్ తప్పుకోవడంతో కొత్త కోచ్ ఎంపిక అనివార్యమైంది. ఇక వైట్‌బాల్ కోచ్ మెకల్లమ్ ఎంపికపై ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తాజాగా స్పందించాడు. ఇదొక సంచలన నిర్ణయమని స్టోక్స్ అన్నాడు.
"మెకల్లమ్ మా జట్టు వైట్ బాల్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. తొలుత ఈ వార్త విని చాలా ఆశ్చర్యపోయాను. అన్ని ఫార్మాట్లలో మెకల్లమ్ కోచ్‌గా ఎంపిక అవ్వడం ఇంగ్లండ్ క్రికెట్ ప్రపంచంలో తిరిగిలేని శక్తిగా అవతరిస్తుంది.
ఇదొక అద్భుతమైన నిర్ణయం. అతడు ఇప్పటికే కోచ్‌గా టెస్టుల్లో ఏమి సాధించాడో మనం చూశాం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కూడా బాజ్(మెకల్లమ్)తో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. అతడికి వైట్‌బాల్ క్రికెట్‌లో చాలా అనుభవం ఉంది.
అదే విధంగా బట్లర్ కూడా మెకల్లమ్‌తో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నడాని నేను భావిస్తున్నాను. చాలా మంది కొత్త ఆటగాళ్లు కూడా మెకల్లమ్ గైడన్స్‌లో ఆడేందుకు సముఖత చూపుతారు. ఇది యువ ఆటగాళ్లకు మంచి అవకాశమని" ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టోక్సీ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment