
అశ్విన్ దెబ్బకు స్టోక్స్ బౌల్డ్(PC: BCCI )
India vs England, 1st Test: ఇంగ్లండ్‌తో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో ఒకే బ్యాటర్‌ను అత్యధికసార్లు అవుట్ చేసిన భారత బౌలర్‌గా నిలిచాడు.
తద్వారా లెజెండరీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. కాగా హైదరాబాద్‌లో గురువారం మొదలైన టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ మూడు వికెట్లు తీశాడు.
ఈ క్రమంలో శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా మరోసారి అద్భుత ప్రదర్శనతో మెరిశాడు అశ్విన్. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టగా.. ఓపెనర్ జాక్ క్రాలే(31)ను అవుట్ చేసి భారత్‌కు తొలి వికెట్ అందించాడు.
📽️ R Ashwin to Ben Stokes
— BCCI (@BCCI) January 27, 2024
What a delivery 🙌#TeamIndia | #INDvENG | @ashwinravi99 | @IDFCFIRSTBank pic.twitter.com/sxBGnhmhl0
అప్పట్లో కపిల్ దేవ్
ఆ తర్వాత బెన్ స్టోక్స్‌ను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. తద్వారా తన ఖాతాలో రెండో వికెట్‌ను జమ చేసుకున్నాడు. కాగా టెస్టుల్లో అశూ.. స్టోక్స్ వికెట్ పడగొట్టడం ఇది పన్నెండోసారి. గతంలో కపిల్ దేవ్.. ముదాసర్ నాజర్‌ను 12సార్లు పెవిలియన్‌కు పంపాడు.
ఇక ఈ జాబితాలో కపిల్ దేవ్(12), అశ్విన్ (12) సంయుక్తంగా అగ్ర స్థానంలో కొనసాగుతుండగా... ఇషాంత్ శర్మ అలిస్టర్ కుక్‌ను 11 సార్లు అవుట్ చేసి మూడో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే.. కపిల్ దేవ్.. గూచ్‌ను 11 సార్లు, డేవిడ్ వార్నర్‌ను అశ్విన్ 11 సార్లు అవుట్ చేయడం విశేషం.
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ హైదరాబాద్ టెస్టు తుదిజట్లు:
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్.
ఇంగ్లండ్
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ టామ్ హార్ట్లే, మార్క్ వుడ్, జాక్ లీచ్.
Comments
Please login to add a commentAdd a comment