
ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బంతితో మెరిశాడు. ఓ సంచలన బంతితో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను బుమ్రా బోల్తా కొట్టించాడు.
ఏమైందంటే..
ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నప్పటికీ స్టోక్స్ మాత్రం భారత స్పిన్నర్లను టార్గెట్ చేస్తూ బౌండరీలు వర్షం కురిపించాడు. ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ప్రీమియర్ బౌలర్ బుమ్రాను ఎటాక్‌లోకి తీసుకు వచ్చాడు. రోహిత్ నమ్మకాన్ని జస్ప్రీత్ వమ్ము చేయలేదు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్65 ఓవర్‌లో బుమ్రా వేసిన మూడో బంతిని స్టోక్స్.. ఫ్రంట్ ఫుట్‌కు వచ్చి వికెట్లను వదిలేసి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
అయితే బంతి మాత్రం అనూహ్యంగా టర్న్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో బిత్తర పోయిన స్టోక్స్.. ఏమి బాల్ వేశావు బ్రో అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అంతకుముందు గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో మహ్మద్ షమీ కూడా ఈ విధంగానే స్టోక్స్‌ను ఔట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు.
తొలి రోజు మనదే..
ఇక తొలి రోజు ఆటలో ఇంగ్లండ్‌పై టీమిండియా పైచేయి సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(76), శుబ్‌మన్ గిల్(14) పరుగులతో ఉన్నారు.
రోహిత్ శర్మ 24 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది.ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్ 70 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, అశ్విన్ తలా 3 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. అక్షర్ పటేల్, బుమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
What a beauty from Bumrah 😍
— Cricket on TNT Sports (@cricketontnt) January 25, 2024
Ben Stokes gives his appreciation and England are all out for 246 🏏#INDvENG pic.twitter.com/cWktwuB42B
Comments
Please login to add a commentAdd a comment