అలెస్టర్ కుక్ అరుదైన ఘనత
ముంబై:భారత్తో జరుగుతున్న నాల్గో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్పై టెస్టుల్లో రెండువేల పరుగులకు పైగా సాధించిన విదేశీ క్రికెటర్ల జాబితాలో కుక్ స్థానం సంపాదించాడు. ఇప్పటివరకూ ఐదుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే భారత్పై రెండు వేలు, అంతకు పైగా పరుగులు సాధించగా, కుక్ ఆరో స్థానంలో నిలిచాడు. అయితే టీమిండియాపై టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(2555)తొలి స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో కుక్(46) కొద్దిలో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
ఇదిలా ఉండగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలి రోజు లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 117 పరుగులు చేసింది. కీనట్ జెన్నింగ్స్ హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో అరంగేట్రం మ్యాచ్లోనే తొలి హాఫ్ సాధించి ఇంగ్లండ్ సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడు. మరొకవైపు తాజా మ్యాచ్తో ఈ ఏడాది ఆరుగురు ఓపెనింగ్ జంటలను ఇంగ్లండ్ పరీక్షించింది. ఇలా చేయడం 1995 తరువాత ఇంగ్లండ్కు ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా, 2015లో ఐదుగురు ఓపెనింగ్ జంటలను ఇంగ్లండ్ ప్రయోగించిన సంగతి తెలిసిందే.