fouth test
-
ఈసారి వదలొద్దు..
70 ఏళ్ల ప్రయాణంలో 12 పర్యటనల్లో 47 టెస్టుల పరంపరలో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా తొలిసారిగా 2–1 ఆధిక్యంలో నిలిచింది. మరొక్క విజయం సాధించినా... కనీసం ‘డ్రా’ చేసుకున్నా ... సిరీస్‌ను కైవసం చేసుకుని రికార్డుల్లోకెక్కుతుంది. ఏ తీరుగా చూసినా మళ్లీ ఎప్పటికి వస్తుందోచెప్పలేనంతటి గొప్ప అవకాశం ఇది. ఏమాత్రం పొరపాటు జరుగకుండా చూసుకోవాల్సిన అరుదైన సందర్భం ఇది. ఈ చారిత్రక మలుపును కోహ్లి సేన గెలుపు పిలుపుతో మురిపిస్తుందని ఆశిద్దాం...! సాక్షి క్రీడా విభాగం : 2003–04 ఆసీస్ పర్యటనలో నాలుగు టెస్టుల సిరీస్‌లో రెండో టెస్టును గెలిచిన టీమిండియా 1–0తో పైచేయి సాధించింది. అయితే, తర్వాతి దాంట్లో ఓడిపోవడంతో ఆధిక్యం చేజారింది. ఈ సిరీస్‌లో మొదటి, నాలుగో టెస్టులు ‘డ్రా’గా ముగియడంతో తుది ఫలితం 1–1గా మారింది. అంతకుముందు 1977–78లో 2–2తో సమంగా ఉన్న స్థితిలో ఐదో మ్యాచ్‌లో ఓడి సిరీస్‌ను కోల్పోయింది. కంగారూ గడ్డపై ఇప్పటి వరకు ఈ రెండు మాత్రమే భారత్ సిరీస్ విజయానికి చేరువగా వచ్చిన సందర్భాలు. కానీ, ఇప్పుడు స్పష్టమైన ఆధిక్యంతో సిడ్నీలో అడబోతోంది. ఈ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్నా కోహ్లి సేన చరిత్ర తిరగరాసినట్లవుతుంది. పట్టిన పట్టు విడవొద్దు... పైన చెప్పుకొన్న ఉదాహరణల్లో మొదటి దాంట్లో భారత్ చేజేతులా పట్టు జారవిడిచింది. స్థిరమైన బ్యాటింగ్ ప్రదర్శన చేయలేక మెల్బోర్న్లో జరిగిన మూడో టెస్టులో ఓడింది. 1977–78 సిరీస్‌లో మాత్రం ఐదో టెస్టులో అతి భారీ లక్ష్యాన్ని (492) ఛేదిస్తూ 445 పరుగుల వద్ద ఆగిపోయింది. పోరాటం ఎలా ఉన్నా... ఈ రెండు సార్లూ ‘బ్యాటింగ్’దే ప్రధాన పాత్ర కావడం గమనార్హం. ప్రస్తుతం కూడా బ్యాటింగే జట్టును కొంత కలవరపెడుతోంది. మెల్బోర్న్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డర్ కుప్పకూలిన వైనమే దీనికి నిదర్శనం. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన భారీ ఆధిక్యానికి రెండో ఇన్నింగ్స్‌లో కుర్రాళ్లు మయాంక్ అగర్వాల్, రిషభ్ పంత్ విలువైన పరుగులు జోడించడంతో ఇబ్బంది లేకపోయింది. ఆసీస్ ఓడిన తేడా (137 పరుగులు)ను పరిగణనలోకి తీసుకుంటే వీరిద్దరి ఇన్నింగ్స్ విలువ తెలుస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, ‘ఓడినా పోయేదేమీ లేదుగా’ అనే భావనను వీడి ఏమాత్రం అలసత్వం వహించకుండా పకడ్బందీగా ఆడాల్సి ఉంటుంది. ఆ పొరపాట్లు చేయొద్దు... పిచ్ గురించి అంచనా వేయలేక, అతి విశ్వాసంతో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, తాజాగా ఆస్ట్రేలియాలోనూ ఎదురుదెబ్బలు తగిలాయి. కనీసం ముందస్తు ఊహాగానాలనూ పట్టించుకోకుండా బరిలో దిగి ఫలితం అనుభవించారు. సిడ్నీ టెస్టుకు మాత్రం వాతావరణం సహా అన్ని విషయాలనూ లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఫిట్నెస్ సంతరించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిడ్నీలో వాతావరణం వేడిగా ఉంది. పిచ్ పొడిగా కనిపిస్తోంది. దీంతో ఆస్ట్రేలియా లయన్‌కు తోడుగా స్పిన్నర్ లబషేన్‌ను ఆడిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలా? లేదా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ స్థానాన్ని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో భర్తీ చేయాలా? అనేదానిపై టీమిండియా కచ్చితంగా ముందే ఓ అభిప్రాయానికి రావాలి. అద్భుత ఫామ్‌తో పాటు పోటాపోటీగా వికెట్లు పడగొడుతున్నందున ముగ్గురు పేసర్లతో సరిపెట్టుకుని, హార్దిక్ బదులు పూర్తి ఫిట్‌గా ఉంటే అశ్విన్‌నే ఆడించడం ఉత్తమం. బ్యాటింగ్‌లోనూ అశ్విన్ సామర్థ్యాన్ని తక్కువగా చూడలేం. మెల్బోర్న్లో ప్రత్యర్థి ఆఫ్ స్పిన్నర్ నాథన్ లయన్ కంటే జడేజా మెరుగ్గా రాణించాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్... పేసర్ బుమ్రా తర్వాత జడేజా బౌలింగ్‌లోనే ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. మరోవైపు పక్కటెముకల గాయంతో దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్న దృష్ట్యా అశ్విన్ ఫిట్‌నెస్‌పై ఏమాత్రం అనుమానం ఉన్నా, అతడిని తుది జట్టులో చేర్చకపోవడమే మేలు. రెండో స్పిన్నర్‌గా హనుమ విహారిని ఉపయోగించుకోవచ్చు. బ్యాట్స్‌మెన్ మరింత బాధ్యతగా... పుజారా, కోహ్లి... ఈ సిరీస్‌లో భారత్ బ్యాటింగ్ భారాన్ని పూర్తిగా మోస్తున్నారు. అయితే, నిర్ణయాత్మకమైన స్థితిలో వీరిద్దరికి మిగతా వారూ సహకరించాల్సిన అవసరం ఉంది. అరుదైనదే అయినా మెల్బోర్న్ రెండో ఇన్నింగ్స్‌లోలా పుజారా, కోహ్లి పరుగులు సాధించలేకపోతే.. రహానే పూర్తి బాధ్యత తీసుకోవాలి. మూడో టెస్టులో తమ పాత్ర సమర్థంగా పోషించిన ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, హనుమ విహారి సిడ్నీలోనూ దానిని కొనసాగించాలి. రోహిత్ లేనందున లోయరార్డర్లో వికెట్ కీపర్ రిషభ్ పంత్ మరింత కీలకం కానున్నాడు. పరిస్థితులను సమన్వయం చేసుకుంటూ అతడు మరిన్ని పరుగులు జోడిస్తే అవే కీలకం అవుతాయి. ఏదేమైనా, కోహ్లి సేన జోరును కొనసాగిస్తూ, గెలుపు ఊపును నిలబెట్టుకుంటూ కొత్త సంవత్సరం తొలినాళ్లలోనే దేశానికి అద్భుతమైన కానుక ఇస్తుందని బలంగా ఆశిద్దాం... విజయోస్తు టీమిండియా! -
1929 తరువాత ఇదే తొలిసారి
ముంబై:ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్ తో ఇక్కడ జరుగుతున్న నాల్గో టెస్టులో ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిలో రషిద్ ఒక అరుదైన రికార్డును అధిగమించడానికి వికెట్ దూరంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఆదిల్ రషిద్ నాలుగు వికెట్లను సాధించాడు. దాంతో ఒక సిరీస్‌లో 22 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.భువనేశ్వర్ కుమార్‌ను అవుట్ చేయడం ద్వారా రషిద్ ఈ సిరీస్‌లో 22వ వికెట్ సాధించాడు. ఇలా ఒక ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఒక సిరీస్‌లో 22 వికెట్లను తీయడం 1929వ నుంచి చూస్తే ఇదే తొలిసారి. దాదాపు 87 ఏళ్ల క్రితం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో లెగ్ స్పిన్నర్ టిచ్ ఫ్రీమెన్ ఒక సిరీస్‌లో 22 వికెట్లు సాధించగా.. ఆ తరువాత ఇంతకాలానికి ఫ్రీమెన్ సరసన రషిద్ నిలిచాడు. రాజ్ కోట్ లో జరిగిన తొలి టెస్టులో రషిద్ ఏడు వికెట్లు సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు సాధించాడు. విశాఖలో జరిగిన రెండో టెస్టులో ఆరు వికెట్లను రషిద్ తీయగా, మూడో టెస్టులో ఐదు వికెట్లు సాధించాడు. -
విరాట్ సూపర్ షో!
ముంబై: భారత క్రికెట్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు. ఇంగ్లండ్‌తో ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ విరాట్ డబుల్ సెంచరీ సాధించాడు. 302 బంతుల్లో 23 ఫోర్ల సాయంతో డబుల్ మార్కును చేరాడు. ఇది అతని టెస్టు కెరీర్లో మూడో డబుల్ సెంచరీ కాగా, ఈ ఏడాదే వాటిని సాధించడం మరో విశేషం. ఇదిలా ఉండగా మూడు డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారత క్రికెట్ కెప్టెన్‌గా విరాట్ రికార్డు నెలకొల్పాడు. 451/7 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఆదివారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. తొలి సెషన్లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది.ఓవర్ నైట్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి-జయంత్ యాదవ్‌లో కీలక భాగస్వామ్యాన్ని సాధించి జట్టును మరింత పటిష్ట స్థితిలో నిలిపారు. ఈ ఇద్దరూ దాదాపు 190కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో భారత్‌కు తిరుగేలేకుండా పోయింది. ఈ క్రమంలోనే విరాట్ డబుల్ సెంచరీ సాధించాడు. ఇందులో కేవలం 23 ఫోర్లు మాత్రమే ఉండగా, మిగతా వందకు పైగా పరుగులను సింగిల్స్, డబుల్స్ ద్వారానే సాధించాడు. మరొకవైపు విరాట్ డబుల్ పూర్తి చేసే సమయానికి జయంత్ 84 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. -
ఇంగ్లండ్ 400 ఆలౌట్
ముంబై: భారత్‌తో ఇక్కడ జరుగుతున్న నాల్గో టెస్టులో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటైంది. 288/5 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో 112 పరుగులు జత చేసింది. ఓవర్ నైట్ ఆటగాడు బెన్ స్టోక్స్(31)ను తొందరగానే పెవిలియన్ కు పంపినా, మరో ఓవర్ నైట్ ఆటగాడు జాస్ బట్లర్(76) చివరి వికెట్‌గా అవుటయ్యాడు. ప్రతీ ఆటగాడితో ఎంతో కొంత భాగస్వామ్యం నెలకొల్పతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ప్రధానంగా జాక్ బాల్(31)తో కలిసి 54 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలోనే బట్లర్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే లంచ్ తరువాత బట్లర్ స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ నాల్గొందల మార్కును చేరింది. కాగా, జడేజా బౌలింగ్‌లో భారీ షాట్ కు యత్నించిన బట్లర్ బౌల్డ్ అయ్యాడు. దాంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో అశ్విన్ ఆరు వికెట్లు సాధించగా, జడేజా నాలుగు వికెట్లు తీశాడు. -
అశ్విన్ అదుర్స్!
ముంబై: టీమిండియా విజయం సాధించాలంటే స్సిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ చేయి పడాల్సిందే. తన టెస్టు కెరీర్ ఆరంభించిన ఐదేళ్లలో భారత్ సాధించిన విజయాల్లో అశ్విన్‌దే కీలకపాత్ర. అశ్విన్ అరంగేట్రం చేసిన తరువాత భారత్ ఎనిమిది టెస్టు సిరీస్‌లు గెలిచింది. అందులో ఏడుసార్లు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులను అశ్విన్ గెలుకున్నాడంటే అతని పాత్ర ఏమిటో అర్థమవుతోంది. ఈ క్రమంలోనే అతని ఖాతాలో ఎన్నో రికార్డులు చేరాయి. అయితే తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కూడా అశ్విన్ అదరగొట్టాడు. ఇంగ్లండ్ కోల్పోయిన ఏడు వికెట్లలో ఐదు వికెట్లను సాధించి సత్తా చాటుకున్నాడు. తద్వారా భారత్ తరపున ఐదు వికెట్లను 23 సార్లు సాధించి మాజీ దిగ్గజ బౌలర్ కపిల్ దేవ్ సరసన నిలిచాడు. ఈ ఘనతను సాధించి అత్యధికంగా 5 వికెట్లు తీసిన భారత బౌలర్లలో మూడో స్థానంలో నిలిచాడు. అంతకుముందు కపిల్ తన టెస్టు కెరీర్లో కూడా 23 సార్లు ఐదు వికెట్లను సాధించిన సంగతి తెలిసిందే. కాగా, అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్లలో అనిల్ కుంబ్లే(35)తొలిస్థానంలో ఉండగా, హర్భజన్ సింగ్(25) రెండోస్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉండగా, 288/5 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ ఆదిలోనే బెన్ స్టోక్స్(31)వికెట్ ను కోల్పోయింది. బెన్ స్టోక్స్‌ను అశ్విన్ పెవిలియన్ కు పంపి భారత్ కు మంచి ఆరంభాన్నిచ్చాడు. అనంతరం వోక్స్(11), రషిద్(4) లను జడేజా అవుట్ చేయడంతో ఇంగ్లండ్ 334 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ ను నష్టపోయింది. -
తొలి రోజు.. ఇంగ్లండ్ జోరు!
ముంబై: భారత్‌తో ఇక్కడ జరుగుతున్న నాల్గో టెస్టు తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ ఆధిపత్యం కొనసాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసి పై చేయి సాధించింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో కీనట్ జెన్నింగ్స్(112;219 బంతుల్లో 13 ఫోర్లు) శతకం సాధించగా, అలెస్టర్ కుక్(46) తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. ఈ జోడి తొలి వికెట్ కు 99 పరుగులు జోడించిన తరువాత కుక్ పెవిలియన్ చేరాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయిన కుక్‌ను పార్థీవ్ పటేల్ స్టంపింగ్ చేశాడు. దాంతో లంచ్ కు ముందే ఇంగ్లండ్ వికెట్ ను కోల్పోయింది. కాగా, ఆ తరువాత జెన్నింగ్స్ తో కలిసిన జో రూట్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేశాడు.అయితే రూట్(21)ను అశ్విన్ పెవిలియన్ కు పంపడంతో ఇంగ్లండ్ కొద్దిగా కష్టాల్లో పడినట్లు కనిపించింది. ఆ తరుణంలో జెన్నింగ్స్-మొయిన్ అలీల జోడి భారత బౌలర్లకు పరీక్షగా నిలిచింది. మూడో వికెట్‌కు 94 పరుగులు జోడించి ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితిలో నిలిపింది. ఈ క్రమంలోనే అలీ(50) అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కాగా, జట్టు స్కోరు 230 పరుగుల వద్ద ఉండగా అలీ మూడో వికెట్ గా అశ్విన్ అవుట్ చేశాడు. ఆ వెంటనే జెన్నింగ్స్‌ను కూడా అశ్విన్ పెవిలియన్ కు పంపి భారత్ కు చక్కటి బ్రేక్ ఇచ్చాడు. మరో 19 పరుగుల వ్యవధిలో బెయిర్ స్టో(14)కూడా అశ్విన్ కు చిక్కడంతో భారత్ పట్టు సాధించినట్లు కనబడింది. అయితే ఆ తరువాత బెన్ స్టోక్స్(25 బ్యాటింగ్), బట్లర్(18 బ్యాటింగ్)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడటంతో మళ్లీ ఇంగ్లండ్‌దే పైచేయి అయ్యింది. కుక్ అరుదైన ఘనత ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్‌పై టెస్టుల్లో రెండువేల పరుగులకు పైగా సాధించిన విదేశీ క్రికెటర్ల జాబితాలో కుక్ స్థానం సంపాదించాడు. ఇప్పటివరకూ ఐదుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే భారత్‌పై రెండు వేలు, అంతకు పైగా పరుగులు సాధించగా, కుక్ ఆరో స్థానంలో నిలిచాడు. అయితే టీమిండియాపై టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(2555)తొలి స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కుక్(46) కొద్దిలో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. జెన్నింగ్స్ 'సెంచరీ' రికార్డు ఇంగ్లండ్ ఓపెనర్ కీనట్ జెన్నింగ్స్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ఈ స్టేడియంలో టెస్టు అరంగేట్రం చేసి సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అంతకుముందు 2006లో ఇంగ్లండ్ ఆటగాడు ఓవై షా ఇక్కడ చేసిన 88 పరుగులే ఇక్కడ ఇప్పటివరకూ అరంగేట్రపు అత్యధిక వ్యక్తిగత స్కోరు. తాజాగా దాన్ని జెన్నింగ్స్ అధిగమించాడు. మరొకవైపు భారత్ లో 2006 నుంచి చూస్తే అరంగేట్రంలోనే 50కి పైగా సాధించిన ఐదో ఇంగ్లండ్ ఆటగాడిగా జెన్నింగ్స్ నిలిచాడు. -
అలెస్టర్ కుక్ అరుదైన ఘనత
ముంబై:భారత్‌తో జరుగుతున్న నాల్గో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్‌పై టెస్టుల్లో రెండువేల పరుగులకు పైగా సాధించిన విదేశీ క్రికెటర్ల జాబితాలో కుక్ స్థానం సంపాదించాడు. ఇప్పటివరకూ ఐదుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే భారత్‌పై రెండు వేలు, అంతకు పైగా పరుగులు సాధించగా, కుక్ ఆరో స్థానంలో నిలిచాడు. అయితే టీమిండియాపై టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(2555)తొలి స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కుక్(46) కొద్దిలో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఇదిలా ఉండగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలి రోజు లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 117 పరుగులు చేసింది. కీనట్ జెన్నింగ్స్ హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో అరంగేట్రం మ్యాచ్‌లోనే తొలి హాఫ్ సాధించి ఇంగ్లండ్ సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడు. మరొకవైపు తాజా మ్యాచ్‌తో ఈ ఏడాది ఆరుగురు ఓపెనింగ్ జంటలను ఇంగ్లండ్ పరీక్షించింది. ఇలా చేయడం 1995 తరువాత ఇంగ్లండ్‌కు ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా, 2015లో ఐదుగురు ఓపెనింగ్ జంటలను ఇంగ్లండ్ ప్రయోగించిన సంగతి తెలిసిందే.