కుక్ డబుల్ సెంచరీ | Cook's double century | Sakshi
Sakshi News home page

కుక్ డబుల్ సెంచరీ

Published Sat, Oct 17 2015 1:45 AM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM

కుక్ డబుల్ సెంచరీ

కుక్ డబుల్ సెంచరీ

అబుదాబి: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ అలిస్టర్ కుక్ (528 బంతుల్లో 263; 18 ఫోర్లు) డబుల్ సెంచరీ చేయడంతో శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 196.3 ఓవర్లలో 8 వికెట్లకు 569 పరుగులు చేసింది. రషీద్ (6 బ్యాటింగ్), బ్రాడ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కుక్‌సేన 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 290/3 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన కుక్, రూట్ (143 బంతుల్లో 85; 7 ఫోర్లు) నిలకడగా ఆడారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 141 పరుగులు జోడించారు.

ఈ క్రమంలో కుక్ 395 బంతుల్లో ద్విశతకం పూర్తి చేశాడు. తర్వాత బెయిర్‌స్టో (8) విఫలమైనా... స్టోక్స్ (87 బంతుల్లో 57; 7 ఫోర్లు) సమయోచితంగా ఆడాడు. పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ కుక్‌కు చక్కని సహకారం అందించాడు. ఈ జోడి ఆరో వికెట్‌కు 91 పరుగులు సమకూర్చడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు ఖాయమైంది. బట్లర్ (23) మోస్తరుగా ఆడాడు. పాక్ బౌలర్లలో రియాజ్ 3, షోయబ్ 2 వికెట్లు తీశారు. మరో రోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశముంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement