కానుకగా 33 బీర్‌ బాటిళ్లు.. | 33 bottles of beer for Alastair Cook as farewell gift from media | Sakshi

కానుకగా 33 బీర్‌ బాటిళ్లు..

Sep 11 2018 3:36 PM | Updated on Sep 11 2018 7:55 PM

33 bottles of beer for Alastair Cook as farewell gift from media - Sakshi

లండన్‌:  టీమిండియాతో ఆఖరి టెస్టు మ్యాచ్‌ తర్వాత రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇంగ్లండ్‌కు క్రికెటర్‌ అలెస్టర్‌ కుక్‌ బీర్‌ బాటిళ్లను కానుకగా అందుకున్నాడు. అంతర్జాతీయ టెస్టు కెరీర్‌లో 33 శతకాలు సాధించిన కుక్‌కు 33 బీర్‌ బాటిళ్లను మీడియా ప్రతినిధులు కానుకగా అందజేశారు. అంతేకాదు ఒక్కో బాటిల్‌పై ఒక్కో మెసేజ్‌ను రాసి కుక్‌కు అందించారు. అనంతరం కుక్‌ వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు.

ఐదో టెస్టులో భాగంగా సోమవారం నాలుగో రోజు ఆటలో  కుక్‌ శతకం సాధించిన తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు కుక్‌ జవాబులిచ్చే క్రమంలో ఒక వ్యక్తి కుక్‌ వద్దకు పెట్టె పట్టుకుని వెళ్లి సదరు కానుకను అందజేశాడు. గత కొన్నేళ్లుగా కెప్టెన్‌గా, ఆటగాడిగా ఇంగ్లండ్‌కు చేసిన సేవలకు గాను కుక్‌కు బీర్‌ బాటిళ్లను అందజేశారు.

‘రిటైర్మెంట్‌ ప్రకటించిన మీకు మా అందరి తరఫు నుంచి చిన్న కానుక. గతంలో మీరు ఒకసారి మాట్లాడుతూ ‘నేను వైన్‌ డ్రింకర్‌ను కాదు బీర్‌ మ్యాన్‌’ అని చెప్పారు. అది దృష్టిలో పెట్టుకునే మీకు 33 బీర్‌ బాటిళ్లను కానుకగా అందజేస్తున్నాం. ఒక్కో బాటిల్‌పై ఒక్కో మీడియాకు చెందిన ప్రతినిధి మీ కోసం ప్రత్యేకమైన మెసేజ్‌ రాశారు’ అని అతను తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement