'పాకిస్తాన్తో పోరుకు సిద్ధం' | We are ready to take on Pakistan, says England captain Alastair Cook | Sakshi
Sakshi News home page

'పాకిస్తాన్తో పోరుకు సిద్ధం'

Published Tue, Jun 14 2016 8:21 PM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM

We are ready to take on Pakistan, says England captain Alastair Cook

లండన్: త్వరలో పాకిస్తాన్తో ఆరంభమయ్యే క్రికెట్ సిరీస్లకు సిద్ధంగా ఉన్నట్లు ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ స్పష్టం చేశాడు. ఇటీవల శ్రీలంక జట్టుతో సాధించిన విజయ పరంపరనే పాక్ తో సిరీస్లో కూడా కొనసాగిస్తామన్నాడు.

 

'పాకిస్తాన్ జట్టుకు మంచి బౌలింగ్ ఎటాక్ ఉంది. కానీ ఆ బౌలింగ్ ను సవాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో మంచి స్కోర్లు సాధించాం. అదొక ఉత్తమమైన సిరీస్. గత కొంత కాలం నుంచి మా జట్టు సమతూకంగా ఉంది. పాకిస్తాన్ పోరుకు సిద్ధంగా ఉన్నాం' అని కుక్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా  అలెక్స్ హేల్స్ పై కుక్ ప్రశంసల వర్షం కురిపించాడు. తమ జట్టులో హేల్స్ కీలక ఆటగాడని కొనియాడాడు.  పాక్ తో సిరీస్ లో హేల్స్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement