లండన్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో ఇంగ్లండ్ రెండో ఇన్సింగ్స్‌లో 423 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్‌కు 464 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్ధేశించింది. 114/2 తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ మొదటి నుంచి భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కుక్ తన చివరి ఇన్సింగ్స్ లో 147 పరుగులతో వీరోచిత సెంచరీతో చెలరేగాడు. మరో ఆటగాడు జో రూట్ తనదైన శైలిలో రెచ్చిపోయి 125 పరుగులు సాధించాడు. క్రీజ్‌లో పాతుకుపోయిన వీరిద్దరిని ఆంధ్రా ఆటగాడు హనుమ విహారి వరుస బంతుల్లో అవుడ్ చేశాడు. చివర్లో బేయిర్‌స్టో 37 పరుగులతో రాణించాడు. దీంతో రెండో ఇన్సింగ్స్‌లో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్లు నష్టానికి 423 పరుగుల సాధించి డిక్లేర్ చేసింది.
మొదటి ఇన్సింగ్స్‌లోని 40 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని భారత్ ముందు 464 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. భారత బౌలర్లలో విహారి, జడేజా మూడేసి వికెట్లతో రాణించారు. రేపు చివరి రోజు కావడంతో భారమంతా బ్యాట్స్‌మెన్‌పైనే ఉంది. ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కుని రేపంతా నిలడబితే టెస్ట్‌ను డ్రాగా ముగించే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment