courtesy : IPL Twitter
ఢిల్లీ: ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ సూపర్ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. 64 బంతులెదుర్కొని 124 పరుగులు చేసిన బట్లర్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు.. 8 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్‌లో సాధించిన శతకం బట్లర్ కెరీర్‌లో తొలి టీ20 శతకం కావడం విశేషం. ఇంగ్లండ్ తరపున బట్లర్ ఆరంభం నుంచి ఎక్కువగా మిడిల్ ఆర్డర్‌లో ఆడడంతో అతనికి ఎప్పుడు టీ20ల్లో సెంచరీలు చేసే అవకాశం రాలేదు. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్ విజయం అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలచిన బట్లర్ స్పందించాడు.
' నా కెరీర్ ఆరంభంలో ఇంగ్లండ్ తరపున ఎక్కువగా మిడిల్ ఆర్డర్‌లో వచ్చేవాడిని. ఆ స్థానంలో వస్తే సెంచరీలు చేసే అవకాశం ఎక్కడ ఉంటుంది... అందునా టీ20ల్లో. అయితే 2017-18 నుంచి మాత్రం ఇంగ్లండ్ తరపున టీ20ల్లో రెగ్యులర్ ఓపెనర్‌గా వస్తున్నా శతకం సాధించలేకపోయా. కానీ ఐపీఎల్‌లో ఇవాళ ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఆ కోరిక నెరవేరింది. అంతేగాక ఈ సందర్భంగా నా మిత్రుడు.. సీనియర్ క్రికెటర్ అలిస్టర్ కుక్‌కు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను ఈరోజు సెంచరీ సాధించా.. టీ20ల్లో సెంచరీ సాధించలేకపోయావు అని కుక్ నోటి నుంచి ఇక నేను విననేమో.. అతను ఆ మాట అనడం ఆపేస్తాడేమో.. అంటూ 'నవ్వుతూ పేర్కొన్నాడు.
కాగా ఇంగ్లండ్ తరపున అన్న ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఆటగాడిగా కుక్ పేరు పొందాడు. తన కెరీర్‌లో ఎక్కువగా టెస్టు మ్యాచ్‌లు ఆడిన కుక్ 32 టీ20లు మాత్రమే ఆడాడు. అయితే 2009 టీ20 ప్రపంచకప్‌లో కుక్ 57 బంతుల్లోనే శతకం సాధించి ఔరా అనిపించాడు. ఇక బట్లర్ ఇప్పటివరకు ఇంగ్లండ్ సహా అన్ని లీగ్‌లు కలిపి 282 టీ20 మ్యాచ్‌లాడి 47 హాప్ సెంచరీలు చేశాడు తప్ప ఇంతవరకు ఒక్క సెంచరీ సాధించలేదు. తాజగా ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో అది సాధించడంతో తన కోరికను నెరవేర్చకున్నాడు. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 55 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
చదవండి: Jos Buttler: ఆ ముగ్గురి సరసన బట్లర్
Comments
Please login to add a commentAdd a comment