
విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పై భారీ శతకంతో చెలరేగాడు. మొదటి రోజు ముగిసే సమయానికి 179 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. తన తొలి డబుల్ సెంచరీకి మరో 21 పరుగుల దూరంలో జైశ్వాల్ నిలిచాడు.
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ విఫలమైన చోట జైశ్వాల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ నేపథ్యంలో యశస్వి జైస్వాల్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ప్రశంసల వర్షం కురిపించాడు. జైశ్వాల్ తన వయసుకు మించిన పరిణతి చూపించాడని కుక్ కొనియాడాడు.
"జైశ్వాల్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 22 ఏళ్ల వయస్సులోనే ఆసాధరమైన ప్రతిభనను కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లతో జైశ్వాల్‌ది ఒకటి. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై జైశ్వాల్ మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు.
మిగితా బ్యాటర్లు అంతా కలిసి కేవలం 158 పరుగులు మాత్రమే చేశారు. జైశ్వాల్ ఇన్నింగ్స్‌ను మినహాయిస్తే ఇప్పటికి భారత బ్యాటింగ్ లైనప్ పేలవంగానే కన్పిస్తోంది. ఇంగ్లండ్ బౌలర్లు కూడా జైశ్వాల్‌కు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయలేదు. అతడిని ఇప్పటికైనా ఆపకపోతే ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పవు అని కుక్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుక్ పేర్కొన్నాడు.